13 March, 2026 | 9:01 PM

రైతుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

13-03-2026 12:44 AM

సబ్సిడీపై వ్యవసాయ యంత్రాలు

మంత్రి దామోదర రాజనర్సింహ

సంగారెడ్డి, మార్చి 12 (విజయక్రాంతి): రైతులు తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి సా ధించి ఆర్థికంగా బలోపేతం కావాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉద్యాన యాంత్రీకరణ పథకం ద్వారా ఆధునిక వ్యవసాయ యం త్రాలను సబ్సిడీపై అందిస్తున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం కలెక్టరేట్ సముదాయ ఆవరణలో ఉద్యాన యాంత్రీకరణ పథకం ద్వారా రైతులకు మినీ ట్రాక్టర్లను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ముగ్గురు ఎస్సీ, ఎస్టీ రైతులకు ఒక్కోటి రూ.4.9 లక్షల విలువ గల 20 హెచ్పి కెపాసిటీ మినీ ట్రాక్టర్లను 60 శాతం సబ్సిడీతో అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, వ్యవసాయం మరి యు ఉద్యాన రంగాల అభివృద్ధికి యాంత్రీకరణ ఎంతో అవసరమని పేర్కొన్నారు. చి న్న, సన్నకారు రైతులు తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధించేందుకు ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు.

రైతులు ఆధునిక పద్ధతులు, యంత్రాలను వినియోగించి సాగు ఖర్చును తగ్గించుకోవడంతో పాటు ఉత్పాదకతను పెంచుకోవాలని సూచించారు. రైతుల ఆర్థికాభివృద్ధి ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని, రైతు లకు అండగా ప్రభుత్వం ఎల్లప్పుడూ ముం దుంటుందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చోంగ్తు, జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య, జిల్లా ఉద్యాన శాఖ అధికారి సోమేశ్వరరావు, డీఆర్డీఓ జ్యోతి తదితర జిల్లా అధికారులు, సంబంధిత లబ్ధిదారులు పాల్గొన్నారు.

నర్సింగ్ కళాశాల విద్యార్థుల కోసం బస్ వితరణ సంగారెడ్డి పట్టణం లోని మెడికల్ కళాశాల అనుబంధంగా ఉన్న నర్సింగ్ కళాశాల విద్యార్థుల కోసం తోషిబా సంస్థ తన సీఎస్సార్ నిధులతో  బస్సు ను బహూకరించింది. మంత్రి దామోదర్ రాజనర్సింహ, టీజిఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి గురువారం కలక్టరేట్ ప్రాంగణం లో లాంఛనంగా బస్సు ను ప్రారంభించారు. ఉద్యాన వన శాఖ ఆధ్వర్యంలో పలువురు రైతులకు పనిముట్లు, ట్రాక్టర్ లను పంపిణీ చేశారు.