పేదల సొంతింటి కల నెరవేర్చిన సర్కార్
ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
ఉట్నూర్, ఏప్రిల్ 24 (విజయ క్రాంతి): ప్రజా ప్రభుత్వంలో రాష్ట్రంలోని ప్రతి పేదవారి సొంతింటి కల నెరవేరుతుందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. ఉట్నూర్ మండలంలోని చాందూ రి, నాగపూర్, ఫకీర్ గుట్టలో నూతన ఇందిరమ్మ ఇండ్ల గృహ గృహప్రవేశంలో పాల్గొని లబ్ధిదారులతో కలిసి గృహప్రవేశం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ లబ్దిదారులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇప్పుడిప్పుడే మహిళలు ఆర్ధికంగా స్థిరపడుతున్నారని, నిరుద్యోగులు ఉద్యోగాలు పొం దుతున్నారన్నారు. విద్యార్థులు ఉన్నత విద్య చదువుతూ మంచి భవిష్యత్ వైపు అడుగులు వేస్తున్నారని, మరెన్నో అబివృద్ధి సంక్షే మ పథకాలను ప్రజా ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. సంక్షేమ పథకాల అమలు లో అధికారుల పాత్ర కీలకంమని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్ర మాలను ప్రజా ప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు ప్రజలకు తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, అధికారులు, ఇందిరమ్మ లబ్దిదారులు తదితరులు పాల్గొన్నారు.






