26 June, 2026 | 6:46 PM

Breaking News

ఐకేపీ వీఓఏలను సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలి   •   టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా ఆరెపల్లి రాహుల్   •   నిర్మల్ పోలీస్... మీ పోలీస్...   •   బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా రాపాక ప్రవీణ్ నియామకం   •   డబుల్ లైన్ రోడ్ నిర్మాణ పనులను ప్రారంభించిన చైర్మన్ బిరుదు రాధాకృష్ణ   •   సుల్తానాబాద్ లో వైభవంగా మొహరం వేడుకలు   •   ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదు: కాంగ్రెస్ హెచ్చరిక   •   యూరియా యాప్ రద్దు చేసి రైతులకు నేరుగా పంపిణీ చేయాలి   •   హరీష్ రావుకు ఆహ్వాన పత్రిక అందజేత   •   టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్.. వైభవ్‌కు దక్కని చోటు   •  

విద్యార్థిని కుటుంబాన్ని ఆదుకుంటాం

25-04-2026 12:12 AM

కలెక్టర్ కే హరిత

కుమ్రం భీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 24(విజయ క్రాంతి): అనారోగ్యంతో మృతి చెందిన ఆశ్రమ పాఠశాల విద్యార్థిని కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని జిల్లా కలెక్టర్ కె. హరిత తెలిపారు. శుక్రవారం సిర్పూర్ (యు) మండలం బాబ్జిగూడ గ్రామాన్ని సం దర్శించిన ఆమె, ఇటీవల మహాగాం బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థిని కె. గంగు బాయి అనారోగ్యంతో మరణించడంతో ఆమె తల్లిదండ్రులు జంగుభాయి, సోమ్రావును వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ విద్యార్థిని కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే కుటుంబానికి నెలకు సరిపడే నిత్యావసర సరుకులను అందిస్తూ ప్రభుత్వ పరంగా సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. విద్యార్థిని మృతి చెందడం బాధాకరమని పేర్కొంటూ కుటుంబంలోని మిగతా ముగ్గురు పిల్లలను మంచిగా చదివించాలని తల్లిదండ్రులకు సూచించారు. గ్రామంలో త్రాగునీటి సమస్య ఉందని గ్రా మస్తులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, వెం టనే చేతి పంపును మంజూరు చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి రమాదేవి, జీసీడీవో శకుంతల తదితరులు పాల్గొన్నారు.