calender_icon.png 20 February, 2026 | 10:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రిజర్వేషన్లు పెంచకుండా ఎన్నికలకు ఎలా?

20-02-2026 12:00:00 AM

  1. ఒకవైపు విద్యార్థుల పరీక్షలు, ఇంకోవైపు రిజర్వేషన్లపై కోర్టులో కేసు
  2. మండిపడ్డ తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్, ఎంపీ ఆర్.కృష్ణయ్య
  3. నేడు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, దీక్షలు, నిరసనలకు పిలుపు..

ముషీరాబాద్, ఫిబ్రవరి19 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం జడ్పీటీసీ, ఎంపీ టీసీ ఎన్నికలకు వెళ్తామని ఆధర బాధరగా చర్యలు చేపట్టాడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్, ఎంపీ ఆర్.కృష్ణయ్య అన్నారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కల్లెక్టరేట్లు ముట్టడిలు, ధర్నాలు, దీక్షలు, నిరసనలు చేపట్టా లని బీసీ లోకానికి పిలుపునిచ్చారు. గురు వారం విద్యానగర్లోని బీసీ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ బీసీ లకు అన్యాయం చేయాలనీ అన్ని పార్టీలు కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు.

బీసీ లు తెగించి పోరాడకపోతే భవిష్యత్తు తరాలకు అన్యా యం జరుగుతుందని అన్నా రు. ప్రభుత్వం నిర్లక్ష్యంగా బీసీ వ్యతిరేక వైఖరితో బీసీలను అణిచి పెడుతుంటే రాజకీయ పార్టీలన్నీ ప్రత్యక్ష పాత్ర వహిస్తున్నాయని అన్నారు. ప్రభుత్వం ద్వంద వైఖరి అవలంబిస్తుందని అన్నారు. ఇప్పుడు 42 శాతం సాధించకపోతే భవిష్యత్తులో ఎప్పుడూ రాదని హెచ్చరించారు. బీసీ లు చివరి పోరాటానికి సిద్దం కావాలన్నారు.

గత ఏడాది నుంచి 100 సార్లుకు పైగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు, ధర్నాలు, ర్యాలీలు, నిరాహార దీక్ష లు, కుల సంఘాల సమావేశాలు, రౌండ్ టే బుల్ సమావేశాలు, సత్యా గ్రహ దీక్షలు, ధర్మదీక్షలు, న్యాయ పోరాట దీక్షలు చివరకు రాష్ట్రస్థాయి బంద్ జరిపాం అని అయినా ప్రభు త్వం ఉద్యమాలు గుర్తించకుండా గుడ్డిగా బీసీలకు అన్యాయం చేస్తూ ముందు కు వెళుతుందన్నారు. దీనిని ఎట్టి పరిస్థితిలో సహిం చమని ఆర్. కృష్ణయ్య హెచ్చరించారు.