14 April, 2026 | 2:29 AM

ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం

14-04-2026 12:40 AM

ఉచిత వైద్యశిబిరాన్ని ప్రారంభించిన గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు 

కూసుమంచి, ఏప్రిల్ 13 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రజలందరికి మెరుగైన, నాణ్యమైన వైద్యాన్ని అందించడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు అన్నారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని గుర్రాలపాడు గ్రామంలో ఖమ్మం గ్రానైట్ మార్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు సోమవారం ప్రారంభించారు..

ఈ సందర్భంగా రాయల నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రజలకు ఆరోగ్యమే ప్రధానమని, ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు..పేద ప్రజలు నివాసం ఉంటున్న ఈ ప్రాంతంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి మంచి వైద్యాన్ని అందించేందుకు ముందుకు వచ్చిన నిర్వాహకులను అభినందించారు.