ధాన్యం కొనుగోలు ప్రక్రియను తక్షణమే పూర్తి చేయాలి
కలెక్టర్ భవేశ్ మిశ్రా
నిర్మల్ జూన్ 4 (విజయ క్రాంతి): జిల్లాలో కొనుగోలు కేంద్రాల్లో మిగిలి ఉన్న వరి ధాన్యం సేకరణ ప్రక్రియను జాప్యం లేకుండా వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వరి ధాన్యం కొనుగోలు అంశంపై సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, రైతులు ఇబ్బందులు పడకుండా కొనుగోలు ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు.
తక్కువ పరిమాణంలో ధాన్యం మిగిలి ఉన్న కొనుగోలు కేంద్రాల్లో సేకరణను వేగవంతం చేసి, కొనుగోలు ప్రక్రియను పూర్తికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, పౌర సరఫరాల శాఖ అధికారులు రాజేందర్, సుధాకర్, డిఆర్డిఓ విజయలక్ష్మి, డీఎం మార్క్ఫెడ్ మహేష్, జిల్లా వ్యవసాయ అధికారి అంజిప్రసాద్, ఉద్యానవన శాఖ అధికారి రమణ, అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.






