5 June, 2026 | 2:42 AM

ములుగు జిల్లాలో పర్యాటక అభివృద్ధి

05-06-2026 01:29 AM

ములుగు (మహబూబాబాద్) జూన్ 4 (విజయక్రాంతి): ములుగు జిల్లాలో పర్యాటక అభివృద్ధికి ప్రత్యేకంగా ప్రభుత్వం దృష్టి సారించిందని జిల్లా కలెక్టర బోర్ఖడే హేమంత్ సహదేవరావు అన్నారు. జిల్లాలో వివిధ పర్యాటక ప్రాంతాలను సందర్శించే పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.

గోవిందరావుపేట మండలం లక్నవరం సరస్సును గురువారం కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ లక్నవరం సరస్సు పరిసర ప్రాంతాలను, ఉయ్యాల వంతెన, పర్యాటకులకు అందుబాటులో ఉన్న సౌకర్యాలు, త్రాగునీరు, మరుగుదొడ్లు, పరిశుభ్రత, బోటింగ్ భద్రతా వంటి అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.