22 April, 2026 | 2:53 PM

Breaking News

కాళేశ్వరంపై కేంద్రం సీబీఐ విచారణ చేయించాలి.. కాంగ్రెస్ ఎంపీ చామల రెడ్డి   •   ఆర్టీసీ సమ్మెకు బిజెపి మద్దతు..   •   గ్రామంలో గుప్త నిధుల కలకలం   •   షాద్‌నగర్ చౌరస్తాలో మల్లికార్జున ఖర్గే దిష్టిబొమ్మ దగ్ధం   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతిపట్ల రేవంత్ రెడ్డి సంతాపం   •   ఆర్టీసీ సమ్మె వేళ... ప్రయాణికులకు మెట్రో గుడ్ న్యూస్   •   ఉప్పల్ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులతో తీన్మార్ మల్లన్న ధర్నా   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత   •   కాళేశ్వరంపై నిందలు వేసి... కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతీసేందుకు కుట్ర   •   కట్టుదిట్టమైన పర్యవేక్షణతో నాణ్యమైన రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి   •  

ధాన్యం కొనుగోళ్ళ ప్రక్రియ వేగవంతం చేయాలి

25-03-2025 07:59 PM

కామారెడ్డి జిల్లాలో ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు పూర్తి..

జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్..

కామారెడ్డి (విజయక్రాంతి): ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్ అన్నారు. మంగళవారం కామారెడ్డి కలెక్టరేట్లో ధాన్యం కొనుగోళ్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. రైతులు పండించిన వరి ధాన్యం అధికారులు పూర్తి సమన్వయంతో పనిచేస్తూ ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని అన్నారు. కలెక్టరేట్ కార్యాలయంలో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రబీ సీజన్ లో ధాన్యం సేకరణకు 446 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని అధికారులు కొనుగోలు కేంద్రాల పట్ల ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు.

రానున్న యాసంగి సీజన్ లో 26 వేల ఎకరాల వరి పంట సాగు చేసినందున సుమారుగా 6.20 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందన్నారు. కొనుగోలు కేంద్రాలకు 5.63 టన్నుల ధాన్యం రానున్నదని అంచనా వేశారు. అలాగే ప్రభుత్వ అధికారులు పూర్తి సమన్వయంతో పని చేస్తూ కొనుగోలు ప్రక్రియను విజయవంతం చేయాలనీ అయన కోరారు. ధాన్యం వచ్చిన ప్రాంతాలలో వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని సూచనలు చేశారు. అదే విధంగా అకాల వర్షాలను దృష్టి లో ఉంచుకొని కేంద్రాలలో తగినన్ని టార్పాలిన్ లను ఏర్పాటు చేయాలనీ మార్కెటింగ్ శాఖ వారికి సూచించారు. ప్రతి కేంద్రంలో రైతులకు త్రాగునీరు, ఓఅర్ ఎస్ ప్యాకేట్స్, ఎండా తీవ్రతకు తగిన టెంట్లు ఏర్పాట్లు చేసుకోవాలని సరిపడా తేమ యంత్రాలు, ప్యాడి క్లినర్స్ అందజేయాలని కోరారు. జిల్లాకు కేటాయించిన  ప్యాడి క్లినర్స్ ను సద్వినియోగం చేసుకోవాలని అలాగే  గోనె సంచులు అందుబాటులో ఉంచాలని అన్నారు.

రైతుల నుండి సేకరించిన ధాన్యానికి  క్వింటాలుకు కనీస మద్దతు ధర గ్రేడ్-ఏ రకానికి గాను రూ.2,320/-, కామన్ రకానికి రూ. 2,300/-, సన్న రకం వడ్లకు చెల్లించాల్సిన 500/- బోనస్  కొరకు రైతులు తమ ధాన్యం వివరములను ట్యాబ్ లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని 24 గంటలలో వారి బ్యాంక్ ఖాతాలలో డబ్బులు పడేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న కొనుగోలు కేంద్రాల వద్ద సమస్యలను పరిష్కరించడానికి జిల్లా కార్యాలయంలో టోల్ ఫ్రీ నంబర్ 08468-220051 ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వి.విక్టర్, జిల్లా పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ రాజేందర్, డి సి ఎస్.ఓ మల్లిఖార్జున బాబు, జిల్లా వ్యవసాయ అధికారి, తిరుమల ప్రసాద్, జిల్లా మార్కెటింగ్ అధికారిణి రమ్య, జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారి శ్రీనివాస్ సంబందిత అధికారులు పాల్గొన్నారు.