22 April, 2026 | 1:09 PM

Breaking News

ఉప్పల్ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులతో తీన్మార్ మల్లన్న ధర్నా   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత   •   కాళేశ్వరంపై నిందలు వేసి... కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతీసేందుకు కుట్ర   •   కట్టుదిట్టమైన పర్యవేక్షణతో నాణ్యమైన రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి   •   ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   గంజి చంద్రమౌళి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు   •   రేవంత్ రెడ్డి నిజస్వరూపం... హైకోర్టు తీర్పుతో తేటతెల్లం   •   పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి   •   దేశాయిపేటలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తం   •   ఆర్టీసీ సమ్మె విరమించాలని మంత్రి పొన్నం విజ్ఞప్తి   •  

డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు

25-03-2025 08:04 PM

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల్ మర్కల్ గ్రామ శివారులో ఉన్న సాంఘీక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో మంగళవారం డిగ్రీ తృతీయ సంవత్సర విద్యార్థులకు కోర్సు పూర్తి చేసుకుని కళాశాలను వీడుతున్న సందర్భంగా ఘనంగా వీడ్కోలు పలికారు. విద్యార్థులు కాలేజీతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డా.సి. శోభారాణి మాట్లాడుతూ... పూర్వ విద్యార్థులు కళాశాలకు ఆస్తి లాంటి వారని, కళాశాల పేరును నిలబెట్టేవారని తెలిపారు. విద్యార్థులు ప్రతికూలతలను అనుకూలతలుగా మలచుకొని లక్ష్యం దిశగా ప్రయాణించాలని ఆకాంక్షించారు. ఆద్యంతం భావోద్వేగంతో సాగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటుగా కళాశాల వైస్ ప్రిన్సిపాల్స్ సీ హెచ్.మీన, డా. డి.శ్రావణి, అధ్యాపకులు పాల్గొన్నారు. విద్యార్థులు నృత్యాలతో సందడి చేసారు.