గ్రామ పంచాయతీ పాలకవర్గం గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడాలి
అప్పుడే గ్రామ పంచాయతీ అభివృద్ధి చెందుతుంది
గుమ్మనూరు గ్రామ పంచాయతీ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్ బాబు
మంథని మార్చి12 (విజయక్రాంతి): గ్రామ పంచాయతీ పాలకవర్గం గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడాలని,అప్పుడే గ్రామ పంచాయతీ అభివృద్ధి చెందుతుందని, గుమ్మనూరు నూతన గ్రామ పంచాయతీ భవనం ప్రారంభోత్సవంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. బుధవారం రాత్రి మంథని మండలంలోని గుమ్మనూరు గ్రామపంచాయతీ నూతన భవనాన్ని రాష్ట్ర ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్థానిక సర్పంచ్ చెరుకు తోట సురేష్ తోపాటు పంచాయతీ పాలకవర్గంతో కలిసి మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మంథని నియోజకవర్గంలో ప్రతి గ్రామ పంచాయతీ అభివృద్ధి చేసేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తానని, పంచాయతీ పాలకవర్గం పార్టీలకతీతంగా గ్రామ ప్రజల అవసరాలు తెలుసుకొని పనిచేస్తే గ్రామంలోని ప్రజలు ఎంతో ఆనందంగా ఉంటారని, అలాగే గ్రామ పంచాయతీ కూడా అభివృద్ధి చెందుతుందని మంత్రి తెలిపారు.
గ్రామాల అభివృద్ధికి తన వంతుగా కృషిచేసి అధిక నిధులు కేటాయించేందుకు కృషి చేస్తానని శ్రీధర్ బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తో పాటు వార్డు సభ్యులు, మంథని మున్సిపల్ చైర్ పర్సన్ వొడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ ముసుకుల సహేందర్ రెడ్డి, సింగిల్ విండో మాజీ చైర్మన్ కొత్త శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు సెగ్గం రాజేశం, ఓదెలు తదితరులు పాల్గొన్నారు.




