13 March, 2026 | 2:54 AM

విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

13-03-2026 12:00 AM

బూర్గంపాడు, మార్చి12 ,(విజయక్రాంతి): విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఈగల్ టీమ్ డీఎస్పీ శివన్ నాయుడు అన్నారు. గురువారం మండలంలోని నాగినేని ప్రోలు రెడ్డిపాలెం గ్రామంలో గల ప్రభుత్వ పాఠశాలలో ’ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా బూర్గంపాడు పోలీసులు ఆధ్వర్యంలో  ఈగల్ విభాగం పోలీసులు అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు మత్తు పదార్థాలతో తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దనన్నారు.మత్తు పదార్థాల నియంత్రణ కేవలం ప్రజల భాగస్వామ్యంతో మాత్రమే సాధ్యమవుతుందని, అందుకు ప్రజలు సహకరించాలన్నారు. అనంతరం విద్యార్థులచేత  ప్రతిజ్ఞ చేయించి,మాదకద్రవ్యాల నిర్మూలనకై అవగాహన ర్యాలీ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో తహశీల్దార్ ప్రసాద్, ఎస్‌ఐ మేడ ప్రసాద్, ఉపసర్పంచ్ అప్పిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు యదు సింహరాజు తో పాటు ఈగల్ టీం అధికారులు,ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు,అబ్కారీ,పోలీస్ శాఖ సిబ్బంది, గ్రామ యువత తదితరులు పాల్గొన్నారు.