ప్రజా పాలన ప్రణాళిక గ్రామ సభలను విజయవంతం చేయాలి
జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్
సూర్యాపేట, జూన్ 3 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నిర్వహించనున్న గ్రామ, వార్డు సభలను విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆదేశించారు.
జూన్ 4, 6, 8, 10 తేదీలలో నిర్వహించనున్న గ్రామ, వార్డు సభల ఏర్పాట్లపై బుధవారం జిల్లా అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, మున్సిప ల్ కమిషనర్లు, సంబంధిత శాఖల అధికారులతో వేబెక్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అన్ని రైతు వేదికల్లో తప్పనిసరిగా గ్రామ సభలు నిర్వహించాలని స్పష్టం చేశారు. ఈ సభలకు మండల స్థాయి అధికారులు అందరూ విధి గా హాజరుకావాలని, ఇందుకు సంబంధించిన సిబ్బంది వివరాలను తక్షణమే సమ ర్పించాలని ఆదేశించారు. ఎండాకాలం తీవ్ర త దృష్ట్యా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, గ్రామ సభలను ఉదయమే నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. సభలు జరిగే చోట తాగునీరు వంటి అన్ని కనీస మౌలిక వసతులు కల్పించాలన్నారు.
పంట మార్పిడిపై అవగాహన కల్పించాలి :
ఈ వానాకాలం సీజన్లో జిల్లాలో సాధారణం కంటే వర్షపాతం తక్కువగా నమోద య్యే అవకాశం ఉన్నందున అధికారులు రైతులకు పంట మార్పిడి ఆవశ్యకతపై అవగాహన కల్పించాలని కలెక్టర్ తేజస్వి నందలాల్ పవార్ అన్నారు.
కలెక్టరేట్ కార్యాలయంలో వర్షాకాల ముందస్తు చర్యలు, శానిటేషన్, త్రాగునీరు, ఓటరు జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) తదితర అంశాలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభు త్వ ఆదేశాల ప్రకారం రైతులను ఈ సారి క్రాప్ డైవర్షన్ వైపు ప్రోత్సహించాలన్నారు. తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలపై వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కల్పించాలన్నారు.
అలాగేస్పెషల్ ఇంటెన్సివ్ రివిజ్ప క్షేత్రస్థాయిలో ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జూన్ 25 నుండి జూలై 24 వరకు బీఎల్‌ఓలు ప్రతి ఇంటికీ తిరిగి ఓటరు జాబితాను క్షుణ్ణంగా పరిశీలిస్తారని తెలిపారు. జూలై 31న ఓటరు ముసాయిదా (డ్రాఫ్ట్) జాబితా ప్రచురణ, అనంతరం అభ్యంతరాల స్వీకరించి అక్టోబర్ 1వ తేదీన ఓటర్ల తుది జాబితాను (ఫైనల్ పబ్లికేషన్) విడుదల చేస్తారని పేర్కొన్నారు.
వర్షాకాలం ముంచుకొ స్తున్న నేపథ్యంలో ప్రజలు అనారోగ్యాల పాలు కాకుండా తగు చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచేందుకు చేపట్టిన ’బడిబాట’ కార్యక్రమంపై గ్రామ సభల్లో ప్రత్యేకంగా చర్చించాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ బి హరి సింగ్, జడ్పీ సీఈఓ శిరీష, డిఆర్డిఓ సన్యాసయ్య, డిపిఓ యాదగిరి, ఇఇ మిషన్ భగీరథ అరుణాకర్ రెడ్డి, డిఇఓ అశోక్, డిఐఇఓ సులోచన, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.






