4 June, 2026 | 3:19 AM

ముగ్గురు సైబర్ నేరస్తుల అరెస్ట్

04-06-2026 02:27 AM

బైంసా జూన్ 3 (విజయ క్రాంతి)లోకేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధిలో సైబర్ నేర స్తులకు బ్యాంకు ఖాతాలను అందించి మోసపూరిత నగదు లావాదేవీలకు సహకరించిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశా రు. విశ్వసనీయ సమాచారం మేరకు నిందితులు వివిధ బ్యాంకుల్లో కరెంట్ ఖాతాలు తెరిచి వాటిని సైబర్ మోసగాళ్లకు కమీషన్ కోసం అప్పగించినట్లు విచారణలో తేలింది. ఇప్పటివరకు పరిశీలించిన ఖాతాల ద్వారా సుమారు రూ.1.38 కోట్ల లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. ఈ ఖాతాలకు వివిధ రాష్ట్రాల్లో నమోదైన అనేక సైబర్ మోసాల ఫిర్యాదులతో సంబంధాలు ఉన్నట్లు వెల్లడైంది. నిందితుల వద్ద నుంచి డిజిటల్ ఆధారాలు సేకరించి, మరిన్ని బ్యాంకు ఖాతాలు మరియు సైబర్ ముఠాలతో ఉన్న సంబంధాలపై విచారణ కొనసాగుతోంది.