calender_icon.png 20 August, 2025 | 4:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీవితమనే శత్రువుపై గెలిచినోడే గొప్పోడు!

27-09-2024 12:15:22 AM

యంగ్ హీరోలు ప్రిన్స్, నరేశ్ అగస్త్య నటిస్తున్న సినిమా ‘కలి’. ఈ చిత్రాన్ని ప్రముఖ కథా రచయిత కె.రాఘవేంద్రరెడ్డి సమర్పణలో రుద్ర క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. శివ శేషు రచించి దర్శకత్వం వహిస్తున్నారు. లీలా గౌతమ్ వర్మ నిర్మాత. సైకలాజికల్ థ్రిల్లర్ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా అక్టోబర్ 4న విడుదల కానుంది. కాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ గురువారం డైరెక్టర్ ప్రశాంత్ వర్మ చేతుల మీదుగా రిలీజ్ చేయించారు. ట్రైలర్‌లో ప్రియదర్శి వాయిస్ ఓవర్ నవ్వించింది. ‘మనిషి పుట్టడంతోనే జీవితం అనే శత్రువును వెంటేసుకుని మరీ పుడతాడు. దాని మీద గెలిచినోడే గొప్పోడవుతాడు. ఓడినోడు మధ్యలోనే...’ అనే డైలాగ్ కథలోని సోల్‌ను చెప్పింది. ఈ చిత్రానికి సంగీతం: జీవన్ బాబు; సినిమాటోగ్రఫీ: నిషాంత్ కటారి, రమణ జాగర్లమూడి.