calender_icon.png 20 August, 2025 | 5:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెండు గంటలు నిలిచిన రైళ్ల రాకపోకలు

20-08-2025 03:37:54 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): విశాఖపట్నం నుంచి ఎల్ టీ టీ ముంబైకి వెళ్లే ఎక్స్ప్రెస్ రైలు ఇంజన్ లో మహబూబాబాద్ జిల్లా ఇంటికన్నె రైల్వే స్టేషన్(Intikanne Railway Station) వద్ద సాంకేతిక లోపం ఏర్పడడంతో బుధవారం ఉదయం రెండు గంటల పాటు నిలిచిపోయింది. ఈ కారణంగా గుంటూరు నుండి సికింద్రాబాద్ వెళ్లే గోల్కొండ ఎక్స్ ప్రెస్ రైలు మహబూబాబాద్ లో గంటన్నర పాటు నిలిచిపోయింది. అలాగే విశాఖపట్నం సికింద్రాబాద్ పైపు వెళ్లే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు కూడా కొద్ది నిమిషాలు నిలిచింది. ఎల్ టీ టీ రైలు ఇంజన్లో తలెత్తిన సాంకేతిక సమస్యను పరిష్కరించేందుకు పైలెట్, అసిస్టెంట్ పైలెట్ కొంతసేపు ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదు. ఈ విషయాన్ని అధికారులకు తెలియజేయడంతో, కాజీపేట నుంచి మరో ఇంజన్ తెప్పించి రైలును తరలించారు. దీని కారణంగా రెండు గంటల పాటు డోర్నకల్ -కాజీపేట సెక్షన్ లో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.