20-08-2025 04:17:06 PM
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): వాంకిడి మండలం కిరిడీ గ్రామానికి చెందిన గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్ కు సమాచారం ఇచ్చారు. గర్భిణిని వాంకిడి మండల కేంద్రంలోని పిహెచ్సికి ప్రవహిస్తుండగా మార్గమధ్యంలో తేజపూర్ సమీపంలో గర్భిణీకి పురిటినొప్పులు ఎక్కువ కావడంతో 108 ఈఏంటి సంతోష్ డెలివరీ చేశారు. ఆడ పిల్లకు జన్మనిచ్చిన వసంతకు ఇది మూడో కాన్పు. తల్లి బిడ్డలను మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అంబులెన్స్ లో డెలివరీ చేయడంతో కుటుంబ సభ్యులు ఈఎంటి సంతోష్, పైలట్ భీమ్రావును అభినందించారు.