26 June, 2026 | 1:47 AM

హెచ్‌సీఏ పాలకవర్గాన్ని సస్పెండ్ చేయాలి

26-06-2026 12:19 AM
  1. బీసీసీఐని కోరిన టీసీఏ
  2. సమగ్ర దర్యాప్తుకు డిమాండ్

హైదరాబాద్, జూన్ 25: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)ప్రస్తుత పా లకవర్గాన్ని వెంటనే సస్పెండ్ చేయాలని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ బీసీసీఐని కోరింది. హెచ్‌సీఏ పనితీరుపై కొన్నాళ్లుగా తాము వ్యక్తం చేస్తున్న ఆందోళనలు హైకోర్టులో దాఖలైన పిటిషన్లతో మరింత బలప డ్డాయని పేర్కొంది. హెచ్‌సీఏ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు హైకోర్టు నియమిం చిన రిటైర్డ్ న్యాయమూర్తి అధికారాలను తొలగించాలని కొన్ని అనుబంధ క్లబ్‌లు కోరడం తీవ్ర అనుమానాలకు తావిస్తోందని టీసీఏ ప్రధాన కార్యదర్శి ధరం గురువారెడ్డి వ్యాఖ్యానించారు.

ఖల్సా క్రికెట్ క్లబ్, జిందా తిలిస్మాత్, సాగర్ క్రికెట్ క్లబ్‌తో పాటు మరికొన్ని అనుబంధ క్లబ్‌ల తరఫున దాఖలైన ఈ పిటిషన్లు న్యాయపరమైన పర్యవేక్షణను, పారదర్శకతను అడ్డుకునే ప్రయత్నాలుగా కనిపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. పారదర్శకత ఉంటే హైకోర్టు నియమించిన స్వ తంత్ర పర్యవేక్షణకు భయమెందుని ప్రశ్నించారు. రిటైర్డ్ న్యాయమూర్తిని తొలగించా లనే ఆత్రుత వెనుక కారణమేంటని గురువారెడ్డి నిలదీశారు.

హెచ్‌సీఏలో ఆర్థిక అక్రమా లు, బంధుప్రీతి, పరిపాలనా లోపాలు, ఆటగాళ్ల ఎంపికలో పక్షపాతం వంటి అంశాలపై టీసీఏ చాలా కాలంగా పోరాటం చేస్తోందని ఆయన గుర్తుచేశారు. అండర్- 14, అండర్ -16, మహిళా క్రికెటర్ల ఎంపికలపై పోలీస్ స్టేష న్లలో అనేక ఫిర్యాదులు నమోదయ్యాయని, టీసీఏ ఫిర్యాదులపై తెలంగాణ లోకాయుక్త జోక్యం చేసుకుని సీబీ-సీఐడీ నాలుగు వారా ల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించిన విషయాన్ని కూడా గుర్తుచేశారు. ప్రస్తుత పాలక వర్గాన్ని సస్పెండ్ చేసి మాజీ క్రికెటర్లతో స్వతంత్ర కమిటీని నియమించాలని  కోరా రు. ఇక టీజీ20 లీగ్‌లో గ్రామీణ క్రికెటర్లకు సరైన ప్రాతినిథ్యం లభించలేదన్నారు. తెలంగాణలోని అన్ని జిల్లాల క్రికెటర్లకు ప్రాతిని ధ్యం వహిస్తున్న టీసీఏకు బీసీసీఐ అనుబం ధ గుర్తింపు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.