26 June, 2026 | 1:03 AM

సాయిసుదర్శన్ సెంచరీ

26-06-2026 12:15 AM
  1. భారత్ ఏ స్కోరు 333/4
  2. లంక ఏతో అనధికార టెస్ట్

గాలె, జూన్ 25 : శ్రీలంక ఏ జట్టుతో జ రుగుతున్న తొలి అనధికారిక టెస్టులో భార త్ ఏ భారీస్కోరు దిశగా సాగుతోంది. గాలే వేదికగా మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలి చి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిలకడగా ఆడింది. స్టార్ బ్యాటర్లు రుతురాజ్ గైక్వాడ్ (22), దేవ్దత్ పడిక్కల్ (12) నిరాశపరిచినా సాయి సుదర్శన్ సెంచరీతో కోలు కుంది. తర్వాత  మిడిలార్డర్ బ్యాటర్లు ధృవ్ జురెల్ (68 నాటౌట్), షేక్ రషీద్ (53 నా టౌట్) అర్ద శతకాలతో సత్తా చాటారు.

సెంచ రీ అనంతరం సాయి సుదర్శన్‌ను గు ణశేఖర్ ఔట్ చేశారు. దీంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 333 పరుగులు చేసింది.  మరో భారత బ్యాటర్ ఆయుశ్ పాండే 25 పరుగులు చేసి వెనుదిరిగాడు.లంక బౌలర్లలో దిలుమ్ సుదీర 2 వికెట్లు తీయగా.. చమిక గుణశేఖర, రవిందు ఫెర్నాంతో తలో వికెట్ దక్కించుకున్నారు.