3 April, 2026 | 3:12 AM

హెల్మెట్ ఉంటే హీరో.. లేకుంటే జీరో..

03-04-2026 12:00 AM

మానుకోట జిల్లాలో ఉధృతంగా హెల్మెట్ ఉద్యమం 

మహబూబాబాద్, ఏప్రిల్ 2 (విజయక్రాంతి): ద్విచక్ర వాహనం నడిపే ప్రతి వ్యక్తి హెల్మెట్ ధరించాలని, హెల్మెట్ ఉంటేనే హీరో అని.. హెల్మెట్ లేకుంటే జీరో అని.. ప్ర మాదం జరిగి ప్రాణాలు కోల్పోకుండా ఖచ్చితంగా హెల్మెట్ ధరించి కుటుంబానికి హీరో లా నిలబడాలని జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ చేపట్టిన నో హెల్మెట్.. నో ఎంట్రీ ఉద్యమం లో సాగుతోంది. మహబూబాబాద్ జిల్లాలోని 18 మండలాల్లో మండలానికి రెండు గ్రామాల చొప్పున, అలాగే ఐదు పట్టణాల్లో రెండేసి వార్డుల్లో నో హెల్మెట్ నో ఎంట్రీ కార్యక్రమం గురువారం అట్టహాసంగా ప్రారంభించారు.

జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ కేసముద్రం మండలం వెంకటగిరి గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఇటీవల రోజురోజుకు ద్విచక్ర వాహనాల ప్రమాదాలు పెరిగి అనేకమంది అకాల మృ త్యువాత పడుతున్నారని, ఇందులో ప్రధానంగా తలకు తీవ్రమైన గాయాలతో మర ణాలు సంభవిస్తున్నాయన్నారు. ఈ నేపథ్యం లో హెల్మెట్ యొక్క ప్రాముఖ్యతను వివరించడం, రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, సరైన ధృవపత్రాలతో వాహనాలను నడపడం వల్ల కలిగే లా భాలను వివరించి, ప్రమాదరహిత మానుకోట జిల్లాగా తీర్చిదిద్దడం లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు చెప్పారు.

ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజల సమిష్టి కృషితో పోలీసులు ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లే అవకాశం ఉందని, ప్రతి ద్విచక్ర వాహనదారుడు కచ్చితంగా హె ల్మెట్ ధరించే విధంగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. దశలవారీగా ఈ కార్య క్రమాన్ని అన్ని గ్రామాలకు, పట్టణంలోని అన్ని వార్డులకు విస్తరించి, హెల్మెట్ ధరించకుండా బండి బయటకు తీసే పరిస్థితి లేకుం డా చూడడమే పోలీసుల లక్ష్యమన్నారు. ఈ మేరకు జిల్లాలోని వివిధ గ్రామాల్లో హెల్మెట్ రక్షణ అంశాన్ని వివరిస్తూ ప్రత్యేకంగా ర్యాలీ లు, లోగోల ప్రదర్శన, సెల్ఫీ పాయింట్లు, గ్రామ ముఖద్వారం వద్ద స్వాగత తోరణం ఏర్పాటు చేయడం లాంటి కార్యక్రమాలను నిర్వహించి ప్రజల్లో హెల్మెట్ యొక్క ప్రాధాన్యతను ముందుకు తీసుకెళ్లారు. ఆయా కార్యక్రమాల్లో డిఎస్పీలు, సీ ఐ లు, ఎస్ ఐ లు, పోలీసు సిబ్బంది, గ్రామాల సర్పంచులు, వార్డు కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్లు పాల్గొన్నారు.