11 June, 2026 | 2:54 AM

సంస్కరణలు మా సంకల్పం!

11-06-2026 02:20 AM

దేశాభివృద్ధికి స్థిరమైన ప్రభుత్వం ఉండాలని ప్రజలు కోరుతున్నారు

రోడ్లు, రైల్వేలు, విమానాశ్రయాలు కల్పించాం.. దేశ రాజకీయాల్లో నేడు చారిత్రాత్మకమైన రోజు

12 ఏళ్ల పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా ప్రధాని మోదీ

ఎన్డీయే పార్టీల విజయమిది

త్వరలో మేడిన్ ఇండియా విమానాలు: మోదీ

భారత్‌లో వస్తున్న పెను మార్పులను ప్రపంచం చూస్తున్నది

ఎన్డీయే వచ్చాక దేశ ప్రజల్లో నమ్మకం పెరిగింది

* కాంగ్రెస్ పాలనలో అన్ని వ్యవస్థలు ధ్వంసమయ్యాయి. రూ.వేల కోట్ల కుంభకోణాలు జరిగాయి. దేశ వృద్ధిరేటు కూడా దారుణంగా ఉండేది. కాంగ్రెస్ పార్టీ తమ వైఫల్యాలను దేశంలోని మెజార్టీ హిందువులపైకి నెట్టివేసింది. జవాబుదారీతనం నుంచి తప్పించుకుంది. 370 ఆర్టికల్‌ను రద్దుచేశాం. నక్సలిజాన్ని నిర్మూలించాం. పలు దేశాలు సమస్యల పరిష్కారం కోసం భారత్ వైపు చూస్తున్నాయి.

 ప్రధాని నరేంద్ర మోదీ

న్యూఢిల్లీ, జూన్ 10: ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ ప్రజల్లో నమ్మకం పెరిగిందని, దేశాభివృద్ధికి స్థిరమైన ప్రభుత్వం ఉండాలని ప్రజలు కోరుకున్నారని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ప్రధానిగా 12 ఏళ్ల పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా ఎన్డీయే నేతల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కూటమి సాధించిన విజయాలు, దేశ ప్రగతిపై ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎక్కువకాలం దేశ ప్రధానిగా ఉండే అవకాశం ఇచ్చిన ప్రజలకు మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు.

ఎన్డీయేలో ఉన్న అన్ని పార్టీలకు ఈ విజయం దక్కుతుందని ఆయన చెప్పారు. దేశ రాజకీయాల్లో నేడు చారిత్రకమైన రోజుగా మోదీ అభివర్ణించారు. ‘కాంగ్రెస్ పాలనలో అన్ని వ్యవస్థలు ధ్వంసమ య్యాయి. రూ.వేల కోట్ల కుంభకోణాలు జరిగాయి. దేశ వృద్ధిరేటు కూడా దారుణంగా ఉండేది. తమ వైఫల్యాలను కాంగ్రెస్ పార్టీ దేశంలోని మెజార్టీ హిందువులపైకి నెట్టివేసింది. జవాబుదారీతనం నుంచి తప్పించుకుంది. మేం వచ్చాక రోడ్లు, రైల్వే లు, విమానాశ్రయాల అభివృద్ధిపై దృష్టి పెట్టాం. ఇంటర్నెట్ వాడేవాళ్ల సంఖ్య 25 కోట్ల నుంచి వంద కోట్లకు పెంచాం.

భారత్ 2014కు ముందు.. ఇప్పుడెలా ఉందో గమనించాలి. ఎన్డీయే ప్రభుత్వం వచ్చిన తర్వాత పెను మార్పులను ప్రజలు బేరీజు వేసుకోవాలి. కేవలం 12 ఏళ్లలోనే ఇన్ని మార్పులు తీసుకొచ్చాం. మా పథకాలు, కార్యక్రమాలను ప్రజలు కూడా ఆమోదించారు’ అని ప్రధాని పేర్కొన్నారు. తాము ప్రవేశపెట్టిన వినూత్న పథకాలు, సంస్కరణల వల్ల దేశవ్యాప్తంగా వచ్చి న సానుకూల మార్పులను చూసి తాము గర్వపడుతున్నామని ఆయన సగర్వంగా ప్రకటించారు. 

 ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది..

‘గతంలో 370 ఆర్టికల్ అంటేనే భయపడేవారు.. మేం రద్దు చేశాం. గతంలో ఉగ్రవాదం పేరు చెబితే భయపడేవారు. మేం వచ్చాక దాడులు చేశాం. దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించాం. ‘వికసిత్ భారత్ 2047’ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నాం. దేశంలో వస్తోన్న పెనుమార్పులను ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది. పలు దేశాలు సమస్యల పరిష్కారం కోసం భారత్ వైపు చూస్తున్నాయి’ అని మోదీ అన్నారు. ఇవాళ భార త్ ఏ విషయంలోనూ ఎవరిపైనా ఆధారపడి లేదని ప్రధాని మోదీ అన్నారు.

‘ఇకనుంచి నౌకలు, కంటైనర్లు మేడిన్ ఇండి యా పేరుతో వస్తాయి. త్వరలో విమానాలపైనా మేడిన్ ఇండి యా ముద్ర చూస్తాం. ఏఐ, డీప్టెక్ సాంకేతికతను మన యువ త అందిపుచ్చుకుంటోంది. సౌర, పవన, న్యూక్లియర్ ఎనర్జీ దిశగా దేశం అడుగులు వేస్తోంది. డిజిటల్ పేమెంట్స్ విషయంలో ఇతర దేశాల కంటే ముందున్నాం’ అని చెప్పారు. కాంగ్రెస్ ఇనుప సంకెళ్ల నుంచి దేశాన్ని రక్షించామని ప్రధాని మోదీ అన్నారు.

సరైన పాలన లేకపోవడం,  సరైన దిశానిర్ధేశం లేకపోవడం, సరైన నిర్ణయాలు తీసుకోకపో వడం గత కాంగ్రెస్ పాలనలో వృద్ధి రేటు క్షీణించడానికి కారణమైందని ప్రధాని చెప్పా రు. దాంతో దేశ ప్రజలు నిరాశా నిస్పృహలకు లోనయ్యారని తెలిపారు. తమది లెక్కల ప్రభుత్వం కాదని.. ఆచరణాత్మక ప్రభుత్వమని తెలిపారు. సంస్కరణలు మా సంకల్పం అని చెప్పారు. ఇంటర్నెట్, డిజిటలైజేషన్లో గణనీయ వృద్ధి సాధించామని అన్నారు.

ఇక కొన్ని విషయాల్లో సామాన్య ప్రజలపై భారం తగ్గించేందుకు తాము తీవ్రంగా కృషి చేస్తున్నామని.. మధ్యతరగతి ప్రజల సవాళ్లు ఏంటో అర్థం చేసుకుని ముందుకు వెళ్తున్నామని అన్నారు. వారి కోసం ౧౨ లక్షల ఆదా యం వరకు పన్ను లేకుండా చేశామన్నారు. తమకు కూటమి కాదని.. దేశమే అన్నింటికంటే ముఖ్యమని స్పష్టం చేశారు. ‘ఏదైనా రాజకీయ పార్టీ కంటే దేశం గొప్పది. అందు కే మేం, నేషన్ ఫస్ట్ అనే స్ఫూర్తితో పనిచేస్తున్నాం.

అందుకే ఏ నిర్ణయం తీసుకోవా లన్నా కష్టమేమీకాదు’ అని ప్రధాని చెప్పారు. ఈ భేటీకి ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని మోదీకి కూటమి నేతలు ఘనస్వాగతం పలికారు. గతంలో ప్రధానిగా జవాహర్‌లాల్ నెహ్రూ ౪,౩౯౮ రోజులు పదవీలో ఉండగా.. ప్రస్తుతం మోదీ మే ౨౬, ౨౦1౪లో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి ౪,౩౯౯ రోజులు పూర్తిచేసుకున్నారు.