పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలి
- బీజేపీపై కేటీఆర్, హరీష్ రావు, జీవన్ రెడ్డిలు ఎందుకు మాట్లాడంలేదు..?
- ధాన్యం, మక్కజోన్నల కొనుగోలుపై కేంద్రం ఎందుకు స్పందించడం లేదు ?
- జగిత్యాల జిల్లా కేంద్రంలో పెట్రోల్ డీజిల్ ధర పెంపుపై నిరసన కార్యక్రమంలో మంత్రి అడ్లూరి..
జగిత్యాల, మే 25 ( విజయక్రాంతి ) : కేంద్ర ప్రభుత్వంపెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమా ర్ డిమాండ్ చేశారు. సోమవారం జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తు జగిత్యాల జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ నుంచి తహసీల్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జగిత్యాల ఆర్డీఓ కార్యాలయం ముం దు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమా ర్ మాట్లాడుతూ పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుడి పాలిట శాపంగా మా రాయని అన్నారు.కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మతం పేరుతో రాజకీయాలు చే యడం తప్ప పేద ప్రజల సంక్షేమం ఏనాడు పట్టించుకోవడంలేదని మంత్రి అడ్లూరి ఆరోపించారు.ఇటీవల హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధాన మంత్రి మోడి పెట్రోల్, డీజి ల్ ధరల విషయం మాట్లాడలేదని అన్నారు.
ఇటీవల జరిగిన తమిళనాడు, కేరళ మరియు పచ్చిమబెంగాల్ ఎన్నికల పూర్తి అయిన తరువాత పెట్రోల్, డీజిల్ ధరలు పెంచారని మంత్రి ఆరోపించారు. కేంద్రంలోని నరేంద్ర మోడి ప్రభుత్వం దేశ ప్రజలు ఎవ్వరు విలాసవంతాలకు దూరంగా ఉండాలని పిలుపుని చ్చిందని దీని అర్ధం మన దేశ ఆర్ధిక వ్య వస్థ అస్థవ్యస్తంగా మారిందని భావించవచ్చని మంత్రి అడ్లూరి అన్నారు.రూపాయి వి లువ రోజు రోజుకు పడిపోతున్న మోడి మాత్రం నిద్ర లేవడం లేదని ఆరోపించారు.
రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగాఉన్న బీఆర్‌ఎస్ పార్టీ న రేంద్ర మోడి ప్రభుత్వానికి వ్యతి రేకంగా ఒక్క మాట మాట్లాడం లేదని మం త్రి అడ్లూరి ఆరోపించారు.బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు, జీవన్రెడ్డిలు ఎందుకు బీజేపీకి వ్యతిరేకంగా మాట్లా డం లేదని మంత్రి ప్రశ్నించారు. పెట్రోల్, డీ జిల్ ధరలతో పాటు బండి భగీరథ్ అంశంపై ఎందుకు బీఆర్‌ఎస్ నాయకులు నోరు మో దపడం లేదని మంత్రి అడ్లూరి అన్నారు.
బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు రెండు ఒక్కటేనని అన్నారు.కేంద్ర ప్రభుత్వానికి పెట్రోల్, డీజిల్ ధరల పెంపు మీద ఉన్న దృష్టి ధాన్యం కొనుగోలు, మక్కల కొనుగోలుపై లేదని ఆరో పించారు. రైతుల వద్ద నుంచి రాష్ట్ర ప్రభు త్వం ఇప్పటి వరకు మూడు పంటల వడ్లు కొనుగోలు చేస్తే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోఉన్న ఎఫ్ సీ ఐ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం నుంచి బియ్యం సేకరించడం లేదని అన్నా రు. జగిత్యాల జిల్లాలో ఇప్పటివరకు 3లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని మిగిలిన లక్ష 80 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని తెలిపారు.
ఇప్పటికైన కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రో ల్, డీజిల్ ధరలకు తగ్గించాలని రాష్ట్రంలో రై తుల వద్ద కొనుగోలు చేసిన మక్కలతో పా టు ఎఫ్ సీ ఐ ద్వార బియ్యం సేకరించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జగిత్యా ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, రాష్ట్ర వెలమ సంక్షేమ సంఘం చైర్మన్ జువ్వాడి నర్సింగ రావు, జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నందయ్య, జగిత్యాల మున్సిపాల్ చైర్మన్ సమిండ్ల వాణితో పాటు జగిత్యాల జిల్లాలోని పలువురు ప్రజాప్రతినిధులు కాం గ్రెస్ నాయకులు పాల్గొన్నారు.






