12 June, 2026 | 1:30 PM

Breaking News

మల్లాపూర్‌లో పందుల బీభత్సం.. చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల విజ్ఞప్తి   •   బాలికపై దారుణానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలి   •   ప్రభుత్వ కళాశాల అడ్డిషన్ల కోసం గడపగడప ప్రచారం   •   సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల అందజేత   •   ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభానికి సిద్ధం చేయండి   •   సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్ పిటిషన్‌పై విచారణ   •   మీనాక్షి నటరాజన్ కేసులో పిటిషనర్ బండారు శ్రీలత కీలక వ్యాఖ్యలు   •   ప్రముఖ 'మాండ్' గాయని గావ్రీ దేవి కన్నుమూత   •   తెలంగాణలో ఓ వైపు భారీ వర్షాలు.. మరోవైపు ఎండలు   •   నిజాంసాగర్ ప్రాజెక్టులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతి   •  

ఆసుపత్రిలో పూర్తి స్థాయిలో వైద్య సిబ్బందిని నియమించాలి

03-11-2025 05:44 PM

లక్షెట్టిపేట (విజయక్రాంతి): పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పూర్తి స్థాయిలో వైద్యులను, సిబ్బందిని నియమించాలని అని సోమవారం సిఐటియు జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ ప్రజావాణిలో తాసిల్దార్ దిలీప్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూ.. లక్షెట్టిపేట, దండేపల్లి, జన్నారం, మూడు మండలాల నుంచి ప్రజలు వైద్యం కోసం నిత్యం వస్తుంటారు కానీ వైద్యులు, సిబ్బంది కొరత ఉండటం ద్వారా ప్రజలకు పూర్తిస్థాయిలో వైద్యం అందించడంలో ఇబ్బందులు కలుగుతున్నాయని ఆరోపించారు. జిల్లా కలెక్టర్, జిల్లా డిఎంహెచ్ఓ, డిసిహెచ్, ఆసుపత్రిలో పూర్తిస్థాయిలో వైద్యులను సిబ్బందిని నియమించి, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడ్లూరి అక్షయ్ కుమార్, సిఐటియు మండల నాయకులు పాల్గొన్నారు.