calender_icon.png 4 November, 2025 | 1:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం నూతన కమిటీ

03-11-2025 05:46:59 PM

కోనరావుపేట (విజయక్రాంతి): అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం 14వ జాతీయ మహాసభలు జనవరి 25 నుండి 28 వరకు జరుగుతున్నాయి. కాబట్టి హార్దిక సహకారాలు అందించండి అనే పిలుపులో భాగంగా కోనరావుపేట మండలంలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం జిల్లా కార్యదర్శి జవ్వాజి విమల ఇంటింటి ప్రచారం చేస్తూ వార్డు కమిటీలు వేయడం జరిగింది. కోనరావుపేట మండల కేంద్రంలో ఎన్నికైన అధ్యక్ష కార్యదర్శులు రోడ్డ పద్మ, తైదల పుష్ప, గాలి మల్లవ్వ, సాధిక, లక్ష్మీనరసమ్మ తదితరులను ఎన్నుకోవడం జరిగింది.

భవిష్యత్తులో మహిళలపై జరుగుతున్న సమస్యలను అలాగే ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా అదేవిధంగా మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు పావుల వడ్డీ పెన్షన్ ఇండ్లు లేని మహిళలకు ఇండ్లు రావాలని గంజాయి డ్రగ్స్ వీటిపై అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం పనిచేస్తుందని మహిళలకు ఎలాంటి సమస్యలు వచ్చినా సమస్యలను పరిష్కరించే దిశగా ఈ సంఘం దోహదపడుతుందని అన్నారు.