calender_icon.png 14 February, 2026 | 1:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరాడంబరంగా సేవాతీర్త్ ప్రారంభోత్సవం

14-02-2026 12:00:00 AM

  1. ‘కర్తవ్యభవన్’బ్లాకులూ ఆరంభం

కొత్త అధ్యాయానికి చిహ్నంగా రూ.100 నాణెం విడుదల

కొత్త పీఎంఓలో పలు కీలక నిర్ణయాలపై మోదీ సంతకాలు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి13: న్యూఢిల్లీలోని బ్రిటిష్ కాలం నుంచి ప్రధాన మంత్రి కార్యాలయం(పీఎంఓ)గా ఉన్న సౌత్ బ్లాక్ కొత్త చిరునామా ‘సేవాతీర్థ్’కు మారింది. ఆధునికహంగులతో నిర్మించిన పీఎంఓతో కూడిన ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ సేవాతీర్థ్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ప్రారం భించారు. దేశ రాజధానిగా న్యూఢిల్లీ 1931 ఫిబ్రవరి 13న అధికారికంగా ఏర్పాటై 95 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని ఈ ప్రారంభోత్సవం నిర్వహించారు. ఆ ధునికత, సమర్థత, పారదర్శకత లక్ష్యంగా నిర్మించిన ఈ సముదాయం భారత పరిపాలనా వ్యవస్థలో సరికొత్త అధ్యాయానికి శ్రీకా రం చుట్టింది.

ఈ క్షణాన్ని గుర్తుచేసుకునేందుకు, ప్రధానమంత్రి ఈ సందర్భంగా రూ. 100 స్మారక నాణేన్ని కూడా విడుదల చేశా రు. ఈ సముదాయం గోడపై ‘నాగరికో దేవో భవ’ (ప్రజలే దేవుళ్లు) అనే నినాదాన్ని పొందుపరిచారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వా త పీఎంఓ వేరేచోటుకు మారడం ఇదే మొదటిసారి. సేవాతీర్థ్‌తోపాటు కీలక మంత్రిత్వ శాఖల కోసం నిర్మించిన ‘కర్తవ్య భవన్’ 1, 2 బ్లాకులను కూడా ప్రధాని ప్రారంభించారు.

కొత్త కార్యాలయంలో అడుగుపెట్టిన వెంటనే ప్రధాని పలు కీలక నిర్ణయాలపై సంతకాలు చేశారు. ప్రమాద బాధితులకు రూ.1.5 లక్షల వరకు నగదు రహిత చికిత్స అందించే ‘పీఎం రాహత్’ పథకానికి ఆమోదం తెలిపారు. మహిళా సంఘాల సభ్యులను లక్షాధికారులుగా మార్చే ‘లఖ్‌పతి దీదీ’ పథకం లక్ష్యాన్ని 3 కోట్ల నుంచి 6 కోట్లకు పెంచారు. 2029 మార్చి నాటికి ఈ లక్ష్యాన్ని చేరుకోవాలని నిర్ణయించారు.

వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేలా మౌలిక సదుపాయాల నిధిని లక్ష కోట్ల నుంచి రెండు లక్షల కోట్లకు పెంచుతూ ప్రధాని నిర్ణయం తీసుకున్నారు. అంకుర సంస్థలను ప్రోత్సహించేందుకు రూ.10 వేల కోట్లతో ‘స్టార్టప్ ఇండియా 2.0’ నిధికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పాత భవనాల్లో విడివిడిగా ఉన్న ప్రధానమంత్రి కార్యాలయం, జాతీయ భద్రతా మండలి సెక్రటేరియట్, క్యాబినెట్ సెక్రటేరియట్ ఇకపై ఈ కొత్త సముదాయం నుంచే పనిచేస్తాయి. ఈ నూతన భవనాలు పర్యావరణ హితంగా 4-స్టార్ గృహ (జీఆర్‌ఐహెచ్‌ఏ) ప్రమాణాలతో నిర్మించారు.