4 April, 2026 | 3:51 PM

Breaking News

సురక్షిత సమాజం కోసం సీసీ కెమెరాల ఏర్పాటు   •   సకాలంలో రైతుల నుండి వరి ధాన్యం కొనుగోలు చేయాలి   •   మేడ్చల్ పెద్ద చెరువు కట్ట పైనుంచి కిందకు రోడ్డు వేసిన వారిపై చర్యలు తీసుకోవాలి   •   రూ.225 కోట్లతో బాసర అభివృద్ధి — మాస్టర్‌ ప్లాన్​పై సీఎం రేవంత్ సమీక్ష   •   ఫుట్‌పాత్‌ ఆక్రమణలపై జీహెచ్ఎంసీ కొరడా   •   గజ్వేల్‌లో పొలిటికల్ హైటెన్షన్.. KCR క్యాంప్ ఆఫీసులో రేవంత్ రెడ్డి ఫోటో   •   వైద్యసేవల్లో నిర్లక్ష్యం, సహించేది లేదు: ఆసుపత్రి నిర్వహణపై హరీష్ రావు అసహనం   •   యాదగిరిగుట్టలో గిరిప్రదక్షిణ.. భారీగా తరలివచ్చిన భక్తులు   •   క్యాతనపల్లి మున్సిపల్ పీఠం బీఆర్ఎస్ కైవసం!.. చైర్మన్‌గా సంధ్యారాణి— వైస్‌ చైర్‌పర్సన్‌గా సరిత   •   ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం— చైర్మన్‌గా టేకుల సుదర్శన్ రెడ్డి   •  

మహిళలకు డీఎంకే కానుక

14-02-2026 12:00 AM
  1. 1.31 కోట్ల మంది ఖాతాల్లో రూ.5వేల చొప్పున జమ

ఎన్నికల ముందు వరాలు

చెన్నై, ఫిబ్రవరి 13: తమిళనాడులో అసెం బ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అధికార డీఎంకే ప్రభుత్వం మహిళలకు మరో ఆకర్షణీయ కానుక అందించింది. ‘కలైంజ్ఞర్ మహిళా హక్కుల పథకం’ కింద 1.31 కోట్ల మంది లబ్ధిదారులకు ముందస్తు మూడు నెలల ప్యాకేజీని విడుదల చేసింది. ముంద స్తు రూ.3వేలతోపాటు వేసవి ప్రత్యేక ప్యాకేజీ కింద మరో రూ.2వేలు మొత్తం రూ.5వేల చొప్పున వారి ఖాతాల్లో జమచేసింది.

సీఎం స్టాలిన్ సోషల్ మీడియాలో ఈ వివరాలు వెల్లడించారు. ఎన్నికల సాకుతో ఈ సాయా న్ని అడ్డుకునేందుకు విపక్షాలు యత్నిస్తున్నా యని మండిపడ్డారు. ఎన్నికల్లో మళ్లీ గెలిస్తే నెలవారీ రూ.వెయ్యి సాయాన్ని రూ.2వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్ల పింఛన్లను రూ.1,200 నుంచి రూ.2వేలకు పెంచుతామన్నారు.