calender_icon.png 14 February, 2026 | 2:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విమాన ప్రమాదం వెనుక కుట్ర?

14-02-2026 12:00:00 AM

  1. ఫైలట్ ఇంధన స్విచ్ ఆఫ్ చేశాడు!

అహ్మదాబాద్ ఫ్లుటై క్రాష్‌పై ఇటాలియన్ కథనం

ఊహాజనితమని కొట్టిపడేసిన ఏఏఐబీ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13 : గత ఏడాది అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం వెనుక కుట్రకోణం ఉంద ని, ఇంధన సరఫరా స్విచ్‌లను ఫైలట్ ఆపేయడంతోనే కూలిపోయిందని ఇటాలియన్ పత్రిక వెలువరించిన కథనం సంచలనం సృ ష్టిస్తోంది. ఈ విమాన ప్రమాదం సాంకేతిక లోపం వల్ల కాదని, పైలట్ ఉద్దేశపూర్వకంగా చేసిన చర్య వల్లే జరిగిందని ఆ నివేదిక పే ర్కొంది. జూన్ 2025లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బోర్డ్ (ఏఏఐబీ) దర్యాప్తు చివరి దశలో ఉందని తెలియజేసింది.

దీం తో ఇప్పటివరకు అనుసరించిన విధానపరమైన ప్రోటోకాల్‌పై సంక్షిప్త నివేదికను దాఖ లు చేయాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని కోరిన ఒక రోజు తర్వాత, ఇటాలియన్ ‘కొరియర్ డెల్లా సెరా’లో కథనం వచ్చింది. ఈ కథనం ప్రకారం.. విమాన ఇంజిన్లకు ఇంధనం సరఫరా చేసే స్విచ్‌లను పైలట్ ఉద్దేశపూర్వకంగా ఆపివేయడం వల్లే విమానం కూలిపోయిం ది. జూన్ 2025లో జరిగిన ఈ దుర్ఘటనలో మొత్తం 260 మంది ప్రాణాలు కోల్పోయా రు. అయితే ఈ కథనంపై భారత విచారణ సంస్థ ‘ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో’ (ఏఏఐబీ) స్పందించింది.

ఇటా లియన్ పత్రికలో వచ్చిన వార్తలు అవాస్తవమని, కేవలం ఊహాజనితమని కొట్టిపారే సింది. విచారణ ఇంకా కొనసాగుతోందని, ఎటువంటి తుది నిర్ణయానికి రాలేదని స్పష్టం చేసింది. గతంలో వెలువడిన ప్రాథమిక నివేదిక ప్రకారం.. టేకాఫ్ అయిన కొద్ది క్షణాలకే విమానంలోని ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్లు ‘రన్’ పొజిషన్ నుంచి ’కటాఫ్’ పొజిషన్‌కు మారాయి. ఈ స్విచ్‌లు దానంతటవే మారాయా లేదా ఎవరైనా మార్చారా అనే కోణంలో విచారణ జరుగుతోంది. అయితే అమెరికాకు చెందిన నిపుణులు మాత్రం ఇది మానవ తప్పిదమేనని భావిస్తున్నారు.

ప్రస్తు తం ఈ కేసు సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. విచారణను మూడు వారాల్లోగా పూర్తి చే యాలని కోర్టు ఆదేశించింది. పైలట్ల సంఘా లు, మరణించిన కెప్టెన్ సుమీత్ సభర్వాల్ కుటుంబ సభ్యులు ఈ ఆరోపణలను తీవ్రం గా ఖండిస్తున్నారు. విచారణ పూర్తి కాకముందే పైలట్లపై నిందలు వేయడం సరికా దని వారు అభిప్రాయపడుతున్నారు. డీజీసీఏ తుది నివేదిక వెలువడితేనే ఈ ఘోర ప్రమాదానికి అసలు కారణం ఏమిటనేది స్పష్టంగా తెలుస్తుంది.