అంజనా దేవి చేతుల మీదుగా విడుదలైన ‘ది 100’ టీజర్

27-04-2024 12:05:00 AM

‘మొగలి రేకులు‘ ఫేమ్ ఆర్.కె.సాగర్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ది 100’. రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకుడు. థ్రిల్లర్‌గా రానున్న ఈ సినిమా టీజర్ అగ్రనటుడు చిరంజీవి తల్లి అయిన అంజనా దేవి చేతుల మీదుగా శుక్రవారం విడుదలైంది. నిజాయితీ గల పోలీస్ అధికారి పాత్రలో ఆర్.కె నటిస్తున్న ఈ సినిమాలో మిషా నారంగ్ ఆయన సరసన కనపడనుండగా, మరో కీలక పాత్రలో ధన్య బాలకృష్ణ నటిస్తున్నారు. క్రియా ఫిల్మ్స్ కార్ప్, దమ్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను ఇటీవల భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు విడుదల చేశారు. ఆర్.కె.సా గర్, మిషా నారంగ్, ధన్య బాలకృష్ణ, గిరిధర్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి డీవోపీ: శ్యామ్ కె నాయుడు, సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్.