19-05-2024 01:02:01 AM
హైదరాబాద్, మే 18 (విజయక్రాంతి): దక్షిణ అండమాన్ సముద్రంలో నైరుతి రుతుపవానాలు చురుగ్గా కదులుతున్నాయని, ఈ నెల 22న నైరుతి బంగాళాఖాతంపై అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. అల్పపీడనం బలపడి మే 2౩ నాటికి తెలంగాణ, ఏపీలలో ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. తెలంగాణ జిల్లాల్లో రానున్న రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రాష్ట్ర వ్యాప్తంగా నాగర్‌కర్నూల్ పంట్లపల్లిలో 65.7 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు తెలిపింది.