మిషన్ భగీరథ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
కుమ్రం భీం ఆసిఫాబాద్, ఆగస్టు 11(విజయ క్రాంతి):మిషన్ భగీరథలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉ పేందర్ డిమాండ్ చేశారు. మంగళవారం మిషన్ భగీరథ ఈఈ కార్యాలయం ఎదుట కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. గత ఐదు నెలలుగా పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని, కనీస వేతనం రూ.26 వేలు ఇ వ్వాలని, ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు చె ల్లించాలని కోరారు.
బోనస్, ఈఎస్‌ఐ, పీఎ ఫ్, గ్రాట్యుటీ, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.అనంతరం ఈఈ రాకేష్ ఆధ్వర్యంలో యూనియన్ నాయకులతో చర్చలు జరిగాయి. పెండింగ్ వేతనాలను ఈ నెలాఖరులోగా చెల్లిస్తామని, ఇతర సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుం టామని హామీ ఇవ్వడంతో కార్మికులు ధర్నా విరమించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు ఆత్మకూరు చిరంజీవి, రాజాగౌడ్, షకీర్, బాలేష్, జంషద్ తదితరులు పాల్గొన్నారు.






