బాసర ఆలయంలో డైరెక్టర్ హరీష్ శంకర్ పూజలు
12-08-2026 12:15 AM
కుబీర్ ఆగస్టు 11 ( విజయ క్రాంతి)బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారి సన్నిధిలోని బాలాలయంలో ప్రముఖ సినీ దర్శకు డు హరీష్ శంకర్ మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న హరీష్ శంకర్ కు ఆలయ అధికారులు, అర్చకులు సాదర స్వాగతం పలికారు.
బాలాలయంలో ప్రధాన అర్చకులు సంజీవ్ పూజారి ఆధ్వర్యంలో ప్రత్యేక కుంకుమార్చన పూజలు నిర్వహించి హారతి ఇచ్చారు. బాసర ఆలయ విశేషాలు అడిగి తెలుసుకున్నారు. బాసరలు ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ఎన్నో అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. అనంతరం ఆల య సిబ్బంది ఆయనను శాలువాతో సత్కరించి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజే శారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు అచ్యుత్ కుమార్, హరీష్, కళాదర్ శర్మ, వేద పండితులు నవీన్ శర్మ తదితరులు పాల్గొన్నారు.






