14 May, 2026 | 3:57 AM

సెర్ప్ ఉద్యోగస్తుల సమస్యలను పరిష్కరించాలి

14-05-2026 01:53 AM

ఎర్రుపాలెం మే 13 (విజయక్రాంతి): ఐకెపి సెర్ప్  పరిధిలో పనిచేస్తున్న వి ఓ ఏ లు, సీసీలు, సిబ్బంది సమస్యల పరిష్కారం కోసం బుధవారం నాడు వివో ఏ జె ఎ సి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వం జారీ చేసిన జీవో 363/2025 మరియు జీవో 302/2022 ప్రకారం అమలు చేయాల్సిన పలు అంశాలు ఇంకా అమలు కాలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా వివో ఏ లకు తగిన వేతనాలు, పదోన్నతులు మరియు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. తమ ప్రధాన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. వివో ఏ లకు నెలకు 20 వేల వేతనం అమలు చేయాలి.

ఉద్యోగులకు హెచ్ ఆర్ పాలసీ అమలు చేయాలి. అర్హులైన వివో ఏ లను సిసి లుగా ప్రమోట్ చేయాలి. వివో ఏ లపై నమోదైన కేసులను ఉపసంహరించాలి. టిఏబి బకాయిలను వెంటనే చెల్లించాలి. జీవో 58 ను తక్షణమే అమలు చేయాలి. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోకపోతే 18-05-2026 నుండి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని నాయకులు హెచ్చరించారు. అనంతరం జేఏసీ తరుపున సమ్మె గురించి ఎస్త్స్ర రమేష్ లెటర్ అందించారు. ఈ కార్యక్రమంలో వి ఓ ఏ కమిటీ సభ్యులు కోట హేమలత, రజిత, పి కనకదుర్గ, ఏ ఏడుకొండలు పాల్గొన్నారు.