4 April, 2026 | 9:14 PM

Breaking News

చైతన్య డీమ్డ్ యూనివర్సిటీలో 14వ పట్టభద్రుల దినోత్సవం ఘనంగా   •   సుజాత ఇంటర్నేషనల్ స్కూల్‌పై ఎస్ఎఫ్ఐ ఆగ్రహం   •   క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో రన్ ఫర్ జీసస్ శాంతి ర్యాలీ   •   దుర్వినియోగపరచిన నిధులపై విచారణ చేపట్టిన అధికారులు   •   ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన దాయం విక్రమ్ రెడ్డి   •   హెల్త్ వీక్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి   •   మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో ప్లేస్మెంట్ డ్రైవ్   •   పోమాల్ ఉన్నత పాఠశాలను సందర్శించిన ఆర్జేడీ సోమిరెడ్డి   •   అద్దంకి దయాకర్ జన్మదిన వేడుకలు   •   మరోసారి ఔదార్యం చాటుకున్న తాళ్లూరి పంచాక్షరయ్య చారిటబుల్ ట్రస్ట్   •  

ఐటీ చట్ట సవరణ చెల్లదు

21-09-2024 02:31 AM

బాంబే హైకోర్టు కీలక తీర్పు

ముంబై, సెప్టెంబర్ 20:  దేశంలో నకిలీ వార్తలను నియంత్రించేందుకు ఫ్యాక్ట్ చెక్ యూనిట్లు (ఎఫ్‌సీయూ) ఏర్పాటు చేసేందుకు వీలుగా గతేడాది కేంద్రం ఐటీ రూల్స్ లో చేసిన సవరణలను బాంబే హైకోర్టు కొట్టివేసింది. కేంద్ర సవరణలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 19కి విరుద్ధమని శుక్రవా రం జస్టిస్ ఏఎస్ చందుర్కర్ తీర్పు చెప్పారు. రూల్స్ సవరణను సవాల్‌చేస్తూ ప్రముఖ స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా పిటిషన్ దాఖలు చేశారు. గతంలో ఈ పిటిషన్ ను విచారించిన డివిజన్ బెంచ్ పరస్పర విరుద్ధమైన తీర్పు ఇవ్వటంతో కేసు మూడో జడ్జీ వరకు వెళ్లింది. బెంచ్‌లోని జస్టిస్ గౌతం పటేల్ కొత్త ఐటీ రూల్స్‌ను రద్దుచేస్తూ తీర్పునిచ్చారు. మరో న్యాయమూర్తి నీలా గోఖలే వాటిని సమర్ధించారు. దీంతో పిటిషన్ చందుర్కర్ వద్దకు వెళ్లింది. ఎఫ్‌సీయూల ఏర్పాటును గత మార్చిలోనే సుప్రీంకోర్టు నిలిపేసింది. బాంబే హైకోర్టులో విచారణలో ఉన్న కేసులో తీర్పు వచ్చేవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోరాదని కేంద్రాన్ని సుప్రీం ఆదేశించింది. ఐటీ రూల్స్ సవరణను రద్దుచేస్తూ కోర్టు తీర్పు వెలువడింది.