11 May, 2026 | 1:33 AM

గలగలల గజల్ ప్రయాణం

11-05-2026 12:20 AM

పద్యం, కవిత్వం, గీతం, గేయం, గజల్.. ప్రక్రియ ఏదైనా మనసులోని భావాన్ని కళాత్మకంగా వ్యక్తపరచటమే వాటి లక్ష్యం. ఆధునిక కవిత్వంలో వచన కవిత్వంతోపాటు ఇప్పుడు హైకూలు, నానీలు, సప్త పదులు, రుబాయీలు, మణిపూసలు (లఘు రూప కవితలు).. ఇలా తరాన్నిబట్టి రూపాంతరం చెందటం చూస్తున్నాం. నాటి ప్రాచీన సాహిత్యం నుంచి నేటి ఆధునిక సాహిత్యం తీరుతెన్నులను గమనిస్తే, మనకు కాలమాన పరిస్థితులను బట్టి మార్పులు సహజమే అనే విషయం బోధపడుతుంది.

అలా వచ్చిన సాహిత్య ప్రక్రియే గజల్. 17వ శతాబ్దంలోనే హైదరాబాద్ రాజు మహమ్మద్ కులీ కుతుబ్ షా ఉర్దూ, పర్షియన్ భాషల్లో గజళ్లు రాసి ఈ సంప్రదాయానికి బలమైన పునాది వేశారు. ఆ కాలం నాటి కవులు కవులను కీర్తించేందుకు ఎక్కువగా వినియోగించేవారు. తర్వాతర్వాత కవులు ప్రియురాలిని వర్ణించేందుకు, తమ విరహ వేదనను వ్యక్తం చేసేందుకు వాడారు. కానీ, వాటన్నింటికంటే భిన్నంగా దిట్ట కవి దాశరథి కృష్ణమాచార్యులు 1960 దశకంలో గజల్ ప్రక్రియను కవిత్వంలో సామాజిక ఉద్యమాలకు, మానవీయ కథనాలను ప్రతిబింబించేందుకు ప్రయోగించారు. అయితే.. తాను అంతకంటే ముందు ఆయన ప్రఖ్యాత ఉర్దూ కవి మీర్జా గాలిబ్ ఉర్దూ గజళ్లను తెలుగులోకి అనువదించడం విశేషం.

ఈ పరంపరను అవలంబిస్తూ ఇదే కోవలో సి.నారాయణరెడ్డి (సినారె) గజళ్లు రాయడం ప్రారంభించారు. వాటిలో ‘అమ్మగుండె ఊయలలో’, ‘విసుగొచ్చిందా జనమంటే.. వెర్రివాడా!’ వంటి గజళ్లు ప్రసిద్ధి గాంచినవి. తర్వాతి వరుసలో బైరి ఇందిర 2011లో గజళ్లు రాయడం ప్రారంభించారు. తద్వారా ఆమె తొలి తెలుగు మహిళా గజల్ కవయిత్రిగా ప్రసిద్ధిగాంచారు. పీబీ శ్రీనివాస్, శొంఠి పద్మజ గజల్ గాయకులుగా పేరుతెచ్చుకున్నారు.

ఇక సంస్థల విషయానికొస్తే దక్కన్ గజల్ అకాడమీ, గడ్డం శ్యామల కోమరాజు ఫౌండేషన్ గజల్ కవులను ఎంతో ప్రోత్సహిస్తూ వస్తున్నాయి. జీవనది లాంటి ఈ గజల్ ప్రవాహాన్ని అక్షరీకరించారు కవయిత్రి హిమజా రామం. స్వతహాగా కవయిత్రి అయిన ఆమె తెలంగాణ ప్రాంతంలో గజల్ ప్రవాహ ధారను ఒడిసి పట్టి ఒక పుస్తకంలో నిక్షిప్తం చేశారు. ఈ పుస్తకం పేరే ‘తెలంగాణ గజల్ మాలిక’. పుస్తకంలో హిమజ దక్కన్ ప్రాంతంలో గజల్ ప్రస్థానాన్ని వివరిస్తూనే తాను రాసిన 60 గజళ్లనూ ప్రచురించారు.

సామాజిక అంశాలపై 

హిమజా రామం నేపథ్యంలో కొత్తగూడెం ప్రాంతంలోని ఇల్లెందు. ఆ ప్రాంతం సింగరేణికి పుట్టినిల్లు. ఆమె దగ్గర్నుంచి సింగరేణి కార్మికుల కష్టం చూశారు. అందుకే ‘నల్లసూర్యులు పంచుతుండి లోకానికి సింగరేణి - పూలరథం నడుపుతుంది మనదారికి సింగరేణి/ పాలించుటే కాదు ఒక తల్లిలా లాలించి-  కనుల వెలుగు నింపుతుంది సింగరేణి/ తన తనువును చీల్చుకుంటూ నిరంతరం తోడుంటూ - బతుకు విలువ పెంచుతుంది తనవారికి సింగరేణి/ రక్తంతో రాసిన పాటల గుండెను ముద్దాడుతూ -- పరుస్తుంది పోరుకోరకు సింగరేణి’ అంటూ గజల్ రాశారు. నీటి విలువను తెలుపుతూ ‘రైతన్నల కన్నులలో ఆనందం నింపుతుంది చెరువే -- ఊరందరి దాహార్తిని తీర్చుతుంది చెరువే/ మతమేమి జాతియేమి అన్న ప్రశ్న లేదిక్కడ - మనసులలో మానవతా పరిమళం వెదజల్లుతుంది చెరువే/ రుతువులకే ప్రతినిధిగా భూదేవికి సోదరిగా - త్యాగమే తన రూపమై నిలుస్తుంది చెరువే’ అని చాటిచెప్పారు.

తెలంగాణపై ప్రేమతో

తెలంగాణ నుడికారం, యాస అంటే హిమజా రామంకు ఎంతో మక్కువ. అందుకే ‘తెలంగాణ భాష మీద చిన్న చూపు ఉంచకండిొ - ఇక్కడున్న యాస మీద ఈసడింపు పెంచకండి/ పల్లెల్లో పలికేడి ప్రతి మాటకు పరిమళమున్నది - సాహిత్య సంకెళ్లతో శబ్దము బంధించకండి/ వాడుకలోన జిగేలు మైత్రి మాటల్లో మెరుపులు- -నగరపు నిబంధనలు అంటూ ఇక సాధించకండి’ అంటూ గజల్ రాశారు. శ్రమైక జీవన సౌందర్యంపై ‘ఎప్పుడైనా చూశారా గాయపడిన చేతులు  రాళ్లు కొట్టి బండలైన అమ్మానాన్న చేతులు/ ప్రాణాలే పణం పెట్టి సేవలే అందించి- - ప్రపంచానికి ఊపిరి ఊదిన చేతులు/ ఊరు, వాడ మలినాలను ఒళ్ళంతా అలుముకుని - మనదారులు అద్దంలా మెరిపించే చేతులు/ ఎండనక, వాననక పొలాలన్నీ దున్నుతూ - దేశానికి అన్నమై అలరారిన చేతులు’ అంటూ శ్రమజీవులను కొనియాడారు. తెలంగాణ పాట, పల్లె జానపదం ప్రాముఖ్యతను తెలియజేస్తూ ..

‘పల్లె గాలి పల్లకిలో జానపదం 

వినిపిస్తోంది నేడు

పంట పొలాల్లోన ఆశల 

ఉదయమే చిగురిస్తోంది నేడు

మాతృభాషలోనే బానిసల 

గొంతు గళమౌతోంది చూడు

అదిగో విద్యా జ్యోతిలో 

కొత్త కలం మొలుస్తోంది నేడు

బతుకమ్మ పూవుల సోయగం 

పల్లెల్లో పరిమళిస్తోంది

పండుగలా గీతాలతో 

ఊరంతా వెలుగుతోంది నేడు

కూలి చెమటలతో కష్టజీవుల 

బతుకుబాట నడుస్తోంది

సావహిక శక్తితో సరికొత్త కల చేరుస్తోంది నేడు’ అంటూ ఓ గజల్‌లో రకరకాల వస్తువులను తీసుకుని రాశారు. ఇంకా కవయిత్రి ఈ పుస్తకంలో తెలంగాణలోని ఊర్లు, పండుగలు, జాతరల కోలాహలంపై మంచి గజళ్లు రచించారు. ఈ ప్రాం తానికి చెందిన కవులు, ప్రముఖులపై గజళ్లు రాసి, వారిపై తన అభిమానాన్ని చాటుకున్నారు. రాష్ట్ర సాధనలో అమరులైన వారి త్యాగాలను స్మ రించుకున్నారు. గోల్కొం డ కోట, తెలంగాణ సాయుధ పోరాటంపైనా గజళ్లు రాశారు. ఆద్యంతం ఆసక్తిగా సాగే ఈగ జళ్ల పుస్త కం పాఠకులకు గొప్ప కానుక. గజల్ సాహి త్య ప్రక్రియలో విసు గు, విరామం లేకుం డా రచనలు చేస్తున్న ‘హిమజారా మం’ కృ షి అభినందనీ యం. ఆమెను అచ్చమైన తె లంగాణ గజల్ బిడ్డ గా గుర్తించాల్సిన అ వసరం ఉన్నది.

   ప్రతులకు

పేజీలు : 96 (వెల : 250) 

ప్రచురణ : శ్రీ సాయి ప్రింటర్స్, హైదరాబాద్

అన్ని ప్రముఖ పుస్తకాల షాపుల్లోనూ లభ్యం

లేదంటే mhimajaramam@gmail.com 

లేదా సెల్ 95508 33490ను సంప్రదించవచ్చు.