18 August, 2026 | 4:00 AM

కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను కొనసాగించాలి

18-08-2026 01:37 AM

డిప్యూటీ ఎమ్మార్వోకు వినతి 

కొడంగల్, ఆగష్టు 17(విజయక్రాంతి ):కొడంగల్ మండల కేంద్రం లో బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కల్యాణ లక్ష్మీ, షాదీ ము భారక్ పథకాలను కొనసాగించాలని డిప్యుటీ తశిల్దార్ అనితకు వినతి పత్రం అందించా రు. గురువారం కొడంగల్ మండల కేంద్రం లో  బిఆర్‌ఎస్ పార్టీ  ఆధ్వర్యంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముభరక్ పథకాన్ని కొనసాగించాలని డిప్యూటీ తశిల్దార్ అనితకు  వినతి పత్రం అందించారు .  ఈ సందర్బంగా బిఆర్‌ఎస్ పార్టీ  కొడంగల్ మండల అధ్యక్షులు  దామోదర్ రెడ్డి , మాట్లాడుతూ... పేదింటి ఆడబిడ్డల ఆత్మగౌరవానికి,ఆర్థిక భరోసా పథకాలైన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలకు చట్టబద్ధత కల్పించి వెంటనే అమలు చేయాలన్నారు.

ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఆడబిడ్డలకు తులం బంగారం విషయాన్ని పక్కదారి పట్టించడానికి హైకోర్టులో కేసు వేయించి ఈ పథకాలను రద్దు చేయడం ఎంతవరకు సమంజసమని ఈ పథకాలను వెంటనే అమలు చేయాలని, లేనియెడల బిఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ వెంకట్ రెడ్డి, డాక్టర్ నవాజ్,మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మధుసూదన్ రెడ్డి,మల్లేష్ ముదిరాజ్,మాజీ సర్పంచ్ శివకుమార్ సింగ్, దొడ్ల రవి, రవీందర్ చారి,   శేఖర్, రాజశేఖర్,శివ రాజ్,హకీమ్, రాఘవేందర్ రెడ్డి, శరణప్ప,పరమేష్, అమ్మి బాయ్, కాశమ్మ,అంజమ్మ తదితరులు పాల్గొన్నారు.

బీఆర్‌ఎస్ ధర్నా 

శంకర్‌పల్లి, ఆగస్టు 17 (విజయక్రాంతి): కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్ర  చేస్తుందని మండల బి ఆర్ ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట మండల బి ఆర్ ఎస్ నాయకులు పెద్ద ఎత్తున నిరసన ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మండల బి ఆర్ ఎస్ అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి, మున్సిపల్ అధ్యక్షుడు బద్దం శశిధర్ రెడ్డి, మాజీ ఎంపీపీలు గోవర్ధన్ రెడ్డి, నర్సింలు నాయకులు పాల్గొన్నారు.

పథకాలను కొనసాగించాలని.. 

ఘట్‌కేసర్, ఆగస్టు 17 (విజయక్రాంతి):  కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు సోమవారం తహసిల్దార్ కార్యాలయం ముందు  నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కార్యాలయంలో ఎమ్మార్వో లేకపోవడంతో కింది స్థాయి అధికారులకు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఘట్కేసర్ అధ్యక్షుడు బండారి శ్రీనివాస్ గౌడ్, పో చారం మున్సిపల్ మాజీ చైర్మన్ కొండల్ రెడ్డి, వైస్ చైర్మన్లు పలుగుల మాధవరెడ్డి, రెడ్యానాయక్, నాయకులు పాల్గొన్నారు.

పథకాలను అడ్డుకుంటే ఊరుకునేది లేదు..

వికారాబాద్ రూరల్, ఆగస్టు 17 (విజయ క్రాంతి): గత పది సంవత్సరాలుగా ఎలాంటి ఆటంకం రాణి కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలకు ఇప్పుడు ఎందుకు ఆటంకం వస్తుందని పలువురు టిఆర్‌ఎస్ నాయకులు ప్రశ్నించారు.

ఈ మేరకు సోమవారం వికారాబాద్ లో  బిఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి కార్యాలయం అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు  గోపాల్, కడియాల వేణుగోపాల్ అనంతరెడ్డి అశోక్ రాజేందర్ గౌడ్ దేవదాసు, శేఖర్ రెడ్డి మహిపాల్ రెడ్డి సుభాన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.