15-01-2026 12:46:23 AM
జగదేవపూర్, జనవరి 14.జగదేవపూర్ మండల పరిధిలోని తీగుల్ నర్సాపూర్ గ్రామంలో వెలిసిన కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం కొండపోచమ్మ ఉత్సవాలు బైండ్ల పూజారులు వేసిన సదరు పటంతో అంగరంగ వైభవంగా ప్రారంభం అయ్యాయి. ఈ సందర్బంగా ఆలయ ఈఓ రవి కుమార్ మాట్లాడుతూ అమ్మవారికి సాంప్రదాయ పద్ధతులతో పట్టు వస్త్రాలు ఆలయ ప్రధాన అర్చకులు రమేష్ సమర్పించారని తెలిపారు.నేటి నుండి అమ్మవారి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయన్నారు.
రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు అమ్మవారిని దర్శిం చుకుంటారని తెలిపారు.భక్తులకు ఏలాంటి ఇబ్బంది కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సంధ్య శ్రీనివాస్, ఉపసర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షులు స్వామి,గ్రామ పెద్దలు లక్ష్మి నర్సింహా రెడ్డి,ఆలయ సిబ్బంది కనుకయ్య, మహేందర్ రెడ్డి, ఆలయ అర్చకులు రమేష్, మల్లయ్య, లక్ష్మణ్, తిరుపతి,బైండ్ల పూజారులు ప్రసాద్, కార్తీక్, భిక్షపతి గ్రామ ప్రజలు భక్తులు తదితరులు పాల్గొన్నారు.