పాలమూర్‌లో హాట్ టాపిక్..!
ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మాట.. గరం.. గరం..
గట్టిగా చెబితే అబద్ధాలు.. నిజమవుతాయా?
ప్రజా అభిప్రాయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాం
గడిచిన పదేండ్ల పరిపాలనలో తల ఊపడమే ఏం చేసిండ్రు
చరిత్ర గల భవనాన్ని కూలగొట్టి మీ భూములపైనే ధ్యాస
ప్రజా అభిప్రాయానికి గౌరవం ఎక్కడ ..?
మహబూబ్ నగర్, జనవరి 14 (విజయక్రాంతి): ఎన్నికలు సమీపిస్తున్నాయంటే చాలు పార్టీలలో ఒక్కసారిగా సందడి వాతావరణం చెప్పగానే దర్శనమిస్తుంది. పాలమూరు కన్నీటి కోసం తీర్చడంలో ఆ పార్టీ ఈ పార్టీ అంటూ కాలయాపన జరుగుతుందంటూ దశాబ్దల తరబడి రైతన్న కన్నీరు పెట్టుకుంటున్న తుడిచే వారే మాత్రం మాది తప్పు కాదంటే మాది తప్పు కాదు అంటూ అధికార ప్రతిపక్ష పార్టీల నేతల తీరును ప్రజలు నిశితంగా గమనిస్తుండ్రు. ఇటీవల పాలమూరు జిల్లాలో బిఆర్‌ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సర్పంచ్ల సన్మాన సభలో ప్రసంగించిన కొన్ని మాటలు అధికార పార్టీని ఆలోచింపచేయడంతో తప్పులను కూడా గొప్పలుగా మార్చుకొని చెప్తే ఎప్పటికీ అవి నిజం కావంటూ పాలమూరు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి చెప్పిన మాట తీవ్ర చర్చకు దారితీస్తుంది.
గడిచిన రెండేళ్ల కాలంలో ఎమ్మెల్యే ఎప్పుడు కూడా ఇంత ఆగ్రహంగా మాట్లాడలేదని నిజాన్ని నిర్భయంగా చెబుతూ ప్రజలు అవగతం చేసుకుంటే అంతకంటే మరేముంటుందో అంటూ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు సామాన్యుల గుండెలను కూడా ఆలోచింప చేస్తున్నాయని తెలుస్తుంది. కొన్ని మాటలు అసలు యావత్తు తెలంగాణకే గుండె కాయల కరువు కాటకాలకు నిలయంగా మారిన పాలమూరు జిల్లా కడుపు నింపే నిజమైన నాయకులు కాంగ్రెస్ నేతలు అంటూ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ప్రజల ఆలోచనలకు పదును పెడుతున్నాయి.
నిజాన్ని కూడా అబద్ధం చేస్తారా : ఎమ్మెల్యే యెన్నం
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టిన ఆదిశగా చర్యలు తీసుకోకుండా కేవలం కమిషన్ల కోసమే నూతన విధానాలను అమలు చేసి సగమే పూర్తి చేసి ఇంత చేసాం అంతా చేశామంటూ ప్రజలకు మాయమాటలు చెప్పడం వెనక ఉన్న అంతర్య మేమిటని ఎమ్మెల్యే యెన్నం బహిరంగంగానే పలు అంశాలను ప్రస్తావించారు. పాలమూరు జిల్లా లోని వసతి గృహాలతో పాటు గురుకులాలను ఒక్కసారి పర్యవేక్షించండి సిరిసిల్లా, సిద్దిపేట తో పాటు అటువైపు ఉన్న గురుకులాలతోపాటు వసతి గృహాలను నేను వాహనాలను పెడతా పర్యవేక్షించండి..
అక్కడ ఎట్లా ఉన్నాయో ఇక్కడ ఎలాగా అభివృద్ధి చేశారు అనేది తెలుస్తుంది అంటూ చెప్పిన మాటలు పాలమూరు ప్రజలను ఆశ్చర్యానికి గురి చేసేలా చేస్తున్నాయి. ఏమైనా ఎమ్మెల్యే పలు సవాళ్లను బహిరంగంగా విస్తరణంతో నిర్మించిన కొత్త కలెక్టరేట్ నూతన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి స్థానాల మార్పు ఎవరి లబ్ధి కోసం ఎందుకోసం నిర్మించారు చెప్పాల్సిన అవసరం ఉందంటూ కూడా చెప్పిన అంశాలకు ప్రాధాన్యత సంతరించుకుందని పార్టీ వర్గాలతో పాటు ప్రజలు నుంచి విశేష స్పందన లభిస్తుంది.
ప్రజా అభిప్రాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాం..
ప్రజల అభిప్రాయాలను నిర్మొహమాటంగా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతే తప్పేముంటుంది అంటూ చేసిన వ్యాఖ్యలకు విశేష స్పందన లభిస్తుంది. ఇక్కడి ప్రజలు ఆదరించి గెలిపిస్తే గత ప్రభుత్వంలోని నాయకులు వారి పెద్దలు చెప్పినట్టు మాత్రమే చేశారని ఇక్కడ ప్రజలు చెప్పినట్టు అసలు చేయలేదని ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగానే ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను గత ప్రభుత్వం తీవ్ర స్థాయిలో నష్టానికి గురిచేసి ఆర్థికంగా నేడు ఇబ్బందులకు కారణం ఆ ప్రభుత్వమే అంటూ మేము చేసిన వ్యాఖ్యలకు వక్రీకరించడం వెనక ఉన్న అసలు కథ ఏంటని ఎమ్మెల్యే ప్రశ్నల వర్షం కురిపించిన తీరు అందరిని ఆకట్టుకుంది.
ఏమైనా ఎప్పుడూ లేని విధంగా ఎమ్మెల్యే గరం గరంగా విలేకరుల సమావేశం ముగించడం గత ప్రభుత్వం పూర్తిస్థాయిలో పారదర్శకంగా అభివృద్ధి చేయలేదని చెప్పడం ఎందుకు పూర్తి ఆధారాల్లో ఉన్నాయని తెలియజేయడంతో పాలమూరులో ఎమ్మెల్యే సంభాషణకు మద్దతు తెలియజేస్తూ నిజమే కదా అనే ఆలోచనలో పడ్డట్లు తెలుస్తుంది.




