ధరణి తెచ్చిన భూ పంచాయితీ!
- ఈ భూ దందాల వెనుక ఉండి నడిపించేది ఎవరు ?
క్రిస్టియన్‌పల్లి బైపాస్ రోడ్డు సమీపంలోని సర్వే నెంబర్ 272లో రికార్డులు తారుమారు అయ్యాయా..?
భూ ప్రక్రియలో పాల్గొన్న వారిపై రూరల్ పీఎస్ కేసులు నమోదు
ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్లాట్లు కొనుగోలుదారులు
మహబూబ్ నగర్ మే 16 (విజయ క్రాంతి) : ప్రస్తుతం మార్కెట్లో భూమికి ఉన్న విలువ దేనికి లేదని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు పెట్టుబడి తో పాటు భూ క్రయవిక్రయాల ద్వారా ఎంతో ఉన్నత స్థాయికి చేరుకున్న వారు లేకపోలేదు. ప్రభుత్వాలు మారినప్పుడు ఆయా ప్రభుత్వాలు హయాంలో జరిగిన అవినీతి అక్రమాలు అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం వెలుగులోకి తీసుకువస్తూ గత ప్రభుత్వంలో చేసిన అవినీతి అక్రమాలను బయటపెడు తూ ఉంటాయి. ఈ విధానం కూడా నానాటి నుంచి ఆచారంగా వస్తున్నది.
ఈ క్రమంలో మహబూబ్ నగర్ పట్టణంలోని క్రిస్టియన్ పల్లి, బైపాస్ రోడ్డు కొత్త కలెక్టరేట్ సమీపంలో సర్వేనెంబర్ 272 చూస్తే ఇది నిజమే కదా అని అనుమానం రాక తప్పదు. కోట్లా ది రూపాయల విలువచేసే భూములు విషయంలో చిన్న చిన్న మెలుకులను ఉపయో గించి ఇవి మా భూములు అంటే మా భూ ములు అంటూ రిజిస్ట్రేషన్లు చేసుకుంటూ ప్లాట్లు చేస్తూ, విక్రయిస్తూ భూ రియాక్టర్లు పోవు చేసుకుంటున్నారనే ఆరోపణలు బలం గా ఉన్నాయి.
భూమి చూపించు ఈ భూమి మీదే రిజిస్ట్రేషన్ చేసుకుందాం డబ్బులు ఇవ్వండి అంటే కనీస అవగాహన లేకుండా రిజిస్ట్రేషన్ చేసుకుంటే తీరా సమగ్ర సర్వే రిపోర్టు తీసుకుని విచారణ చేస్తే ఆ భూమి మీద కాదు మీరు కట్టిన ఇల్లు మీ భూమిలో కట్టలేదు అంటే వారి పరిస్థితి ఏమి కావాలి. ఇలాంటి వ్యవహార శైలిలో సర్వేనెంబర్ 272 సంబంధించిన బుధవారం జరిగిందని ఆరోపణలు రోజురోజుకు ఉత్పన్నమవుతు న్నాయి.
ఎకరా 32 గుంటల్లో 42 ప్లాట్లు..
తప్పు ఒప్పులు ఒకమారు అటువంటి ఒక ఎకరా 32 గుంటల భూమిలో 42 ప్లాట్లు 200 గజాలవి చేయడం సాధ్యమవుతుందా ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఎం తైనా ఉంది. కాగా రియల్ వ్యాపారులు అం దిన కాడికి భూమిని స్వాధీనం చేసుకుంటూ తక్కువ విస్తీర్ణం లో అనుమతులు పొందు తూ అత్యధికంగా ప్లాట్లు చేస్తూ విక్రయించిన దాఖలాలు ఈ భూమిలో నెలకొన్నాయి.
ఇందుకు ద పట్టణంలోని మంచి ప్రాంతాల్లో గజం విలువ వేలాది రూపాయలు ఉండడ మే కారణంగా తెలుస్తుంది. ఇదే అదునుగా చేసుకొని కొందరు రియల్ వ్యాపారులు కేవ లం ఒక ఎకరా 32 గుంటల భూమిలో 42 ప్లాట్లు చేసి అమ్మిన కాడికామి వివిధ కారణాలు, ఆరోపణలు,
సందేహాలతో పాటు ప లు సమస్యలు ఒప్పందం కావడంతో ఈ ప్ర క్రియ మధ్యలోనే నిలిచిపోయింది. ఈ విషయంపై బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్న లోలోపల్లె కుమిలిపోతున్న సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. సమగ్ర విచారణ జరిగి అందరికీ న్యాయం చేసేలా అధికార యంత్రంగం అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
పట్టా ఒకచోట... నిర్మాణం మరోచోట...
ఈ ప్రాంతంలో 276 సర్వే నెంబర్ రిజిస్ట్రేషన్ చేయించుకుని 272 సర్వే నెంబర్లు ప్లాట్లు చేసి విక్రయించిన దాఖలలో నెలకొన్నాయని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నా యి. ఈ ప్రక్రియలో భాగస్వాములైన వారిపై కేసులు కూడా నమోదు అయినట్లు తెలుస్తుంది. భూమి ఒకచోట నిర్మాణం మరో చోట చేపట్టిన అనుమతులు ఇచ్చిన రెవె న్యూ, మున్సిపల్ అధికారుల సైతం నోరు మెదపలేదంటే ఏ మేరకు ప్రక్రియ ముం దుకు సాగిందో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది.
కోర్టు కేసులతో పాటు పోలీస్ స్టేషన్లో ఈ ప్రక్రియకు సంబంధించి కేసులు నమోదు కావడం జరుగుతుంది. బాధితులు పూర్తిస్థాయిలో వివరాలు సేకరిస్తే మరిన్ని విషయాలు, వాస్తవాలు వారి దృష్టికి రానున్నాయి. మరిన్ని వివరాలతో విజయక్రాంతి ఈ భూ ప్రక్రియ వ్యవహారం అంతా విడుతల వారీగా మీ ముందుకు తీసుకురాబోతుంది.






