17-05-2025 12:00:00 AM
చౌటుప్పల్, మే 16 (విజయక్రాంతి): చౌటుప్పల్ మండలం తంగడపల్లి గ్రామంలోని వార్డ్ ఆఫీస్ వద్ద మండల వ్యవసాయ అధికారి శ్రీ ముత్యాల నాగరాజు అధ్యక్షతన రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని ప్రొఫెసర్.
జయశంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయం గౌరవ డైరెక్టరేట్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ బలరాం మాట్లాడుతూ వరిలో పత్తి పంటలలో తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టాలని సూచించడం జరిగింది . మరియు రసాయన ఎరువులను కొనుగోలు చేసిన తర్వాత రసీదులను జాగ్రత్తగా భద్రపరుచుకోవాలని సూచించడం జరిగింది.
అలాగే రైతులకి మండల వ్యవసాయ అధికారుల యొక్క సలహాలను సూచనలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శాస్త్రవేత్తలు డాక్టర్. కృష్ణ మాట్లాడుతూ వరిలో నూతన వంగడాలను వాడాలని అందులో కేఎన్‌ఎమ్1638, కేఎన్‌ఆర్-15048 మరియు నాలుగు నెలల పంటకాలం కలిగిన రకాలను వాడాలని సూచించారు.
వరికి యూరియాను మూడు దఫాలుగా వేయాలని, పత్తిలో నాలుగు దఫాలుగా వేయాలని సూచించారు. శాస్త్రవేత్త డాక్టర్.స్పందన మాట్లాడుతూ వరిలో సాగునీటిని అవసరం మేరకే వాడాలని, పిలక దశ వరకు ఆరుతడిగా నీటిని ఇవ్వడం వల్ల ఎక్కువ పిలకలు వచ్చి దుబ్బు ఎక్కువగా వచ్చి దిగుబడి కూడా అధికంగా వస్తుందని సూచించడం జరిగింది.
వీలైనంతగా పంట మార్పిడి చేసుకోవాలని సూచించారు. శాస్త్రవేత్తలు వ్యవసాయoలో చేపట్టవలసిన సస్యరక్షణ చర్యల గురించి తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు ఆర్జించే పద్ధతుల మరియు తక్కువ యూరియా వాడి సాగు ఖర్చు తగ్గించుట అవసరం మేరకు రసాయనాలను వినియోగించడం ఎరువులు పురుగు మందులు కొన్నపుడు వాటి రసీదులను పంట కాలం పూర్తి అయ్యేవరకు భద్రపరిచుకోవటం సాగునీటిని ఆదా చేసే మార్గాలను మరియు పంట మార్పిడి చెట్లను పెంచుట వరి పత్తి మరియు కంది పంటలలో తీసుకోవలసిన సస్య రక్షణ గురించి, మేలైన విత్తన వంగడాల గురించి పూర్తి సమాచారం వివరించడం జరిగింది.
చౌటుప్పల్ ఏఎంసి చైర్మన్ ఉబ్బువెంకటయ్య మాట్లాడుతూ సీజనకు ముందే మహోత్తరమైన మంచి కార్యక్రమాన్ని చేపట్టడం చాలా మంచి పరిణామం, శాస్త్రవేత్తలే రైతుల దగ్గరికి వచ్చి చేసే ఇటువంటి ప్రోగ్రాం రైతులకు బాగా ఉపయోగపడుతుంది. గతంలో తంగేడు,జిల్లేడు ఆకులను వేసి కలియదున్ని భూసారాన్ని కాపాడుకునేవారు.
ఇప్పటి పరిస్థితులుకు అనుగుణంగా జీలుగా జనుము వంటి పచ్చిరొట్ట ఎరువులని ముందే కలియదున్ని భూసారాన్ని కాపాడాలి అని సూచించారు. కలుపు మందులకు బదులుగా కలుపుతీస్తేనే రైతులకు బాగా ఉపయోగకరంగా ఉంటుందని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మరియు వ్యవసాయ విస్తరణ అధికారులు రైతులు పాల్గొన్నారు.