07-02-2026 12:00:00 AM
జవహర్‌నగర్, ఫిబ్రవరి 6 (విజయక్రాంతి): పనికోసమని ఇంటి నుంచి బయటకు వెళ్ళిన ఓ వ్యక్తి అదృశ్యమయ్యాడు. ఈ సంఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌హెచ్‌వో సైద య్య తెలిపిన కథనం ప్రకారం జవహర్ నగర్‌లోని సీపీఐ కాలనీలో సంధ్యాకుమారి, భర్త అజిత్ కుమార్ కుటుంబసభ్యులతో కలిసి నివసిస్తున్నారు.
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అజిత్ కుమార్ ఇటీవల నగరానికి వచ్చి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 5న పనికోసమని సికింద్రాబాద్‌కు వెళ్ళిన అజిత్ కుమార్(30) తిరిగి రాలేదు. ఈ మేరకు సంధ్యాకుమారి జవహర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.