calender_icon.png 7 February, 2026 | 4:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంగని మల్లేశ్వర్‌కు బెస్ట్ ఫ్రెండ్స్ ఫౌండేషన్ పరామర్శ

07-02-2026 12:00:00 AM

హనుమకొండ, ఫిబ్రవరి 6 (విజయ క్రాంతి):కాకతీయ యూనివర్సిటీ జర్నలిజం విభాగం అధిపతి ప్రొఫెసర్ సంగని మల్లేశ్వర్ తల్లి సువర్ణ ఇటీవల మరణించిన సంద ర్భంగా శుక్రవారం నాడు బెస్ట్ ఫ్రెండ్స్ ఫౌండేషన్ సభ్యులు హనుమకొండ విద్యారణ్యపురి లోని వారి నివాసంకి వెళ్ళి పరామ ర్శించారు.ఈ సందర్భంగా సంగని సువర్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

అనంతరం బెస్ట్ ఫ్రెండ్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు పులి దేవేందర్ ముది రాజ్ మాట్లాడుతూ మల్లేశ్వర్ విద్యావేత్త గా ఎన్నో సేవలు చేశారని, వివిధ సందర్భాల్లో తన వ్యాసాల ద్వారా అందర్నీ మేల్కొల్పారని, కులాలకు,సంఘాలకు అతీతంగా ఆయ న సేవలు అందించారని ఇలాంటి సందర్భం లో వారికి బెస్ట్ ఫ్రెండ్స్ ఫౌండేషన్ అండగా ఉండి మనోధైర్యాన్నిస్తుందని,వారి తల్లి సువర్ణ కు ఆత్మ శాంతించాలని భగవంతుని వేడుకున్నారు.ఈ కార్యక్రమంలో మిత్రులు ఆకుతోటి శ్రీనివాస్, చీకటి శ్రీనివాస్, బోనా ల రమేష్, ఉమా మహేష్ పాల్గొన్నారు.