కథను మలుపుతిప్పిన మంచిర్యాల అమ్మాయి
‘పుష్ప ది రూలర్’ సినిమాలోని కీలక పాత్రల్లో పుష్ప అన్న కూతురి పాత్ర కూడా ఒకటి. ఒక రకంగా పుష్ప 3కి బీజం వేసిన పాత్ర కూడా ఈమెదేనని చెప్పాలి. తండ్రికి ఇష్టం లేకున్నా చిన్నాన్న పుష్ప కనిపిస్తే చాలు.. ఆయన చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఆమెను కేంద్ర మంత్రిగా నటించిన జగపతిబాబు అన్న కుమారుడు కిడ్నాప్ చేస్తే ఆమె ఒంటిపై చెయ్యి పడితే రప్పరప్పా నరికేస్తానని చెబుతాడు పుష్ప. అయినా సరే విలన్ ఆమెను వదలడు. విలన్‌ని ఏమీ చేయవద్దని జగపతిబాబు కోరతాడు. పుష్ప తన అన్న కూతురిని కిడ్నాప్ చేసిన వ్యక్తిని నరికేస్తాడు. అలా జగపతిబాబు వర్సెస్ అల్లు అర్జున్ అవుతుంది. వీరిద్దరి మధ్య వార్ ఎలా ఉంటుందనేది పార్ట్ 3లో చూడాలి. ఇంత కథకి కారణమైన ఆ అమ్మాయి ఎవరు? ఆమె అసలు పేరేంటి? వంటి విషయాలన్నీ తెలుసుకుందాం. ఆమె పేరు పావని కరణం. మంచిర్యాలలో పుట్టి పెరిగిన పావని సినిమాలపై ఉన్న ఆసక్తితో హైదరాబాద్‌కు వచ్చేసింది. ముందుగా తన కెరీర్‌ను షార్ట్ ఫిలింస్‌తో మొదలు పెట్టింది. ఆ తరువాత ‘మోడ్రన్ హైదరాబాద్’ అనే వెబ్ సిరీస్ చేసింది. కామెడీ ఎంటర్‌టైనర్ ‘పరేషాన్’ చాలా మందికి గుర్తుండే ఉంటుంది. ఆ సినిమాలోని ‘సమోసా తింటావా శిరీషా’ అనే డైలాగ్ బాగా పాప్యులర్ అయ్యింది. తాజాగా ‘పైలం పిలగా’ చిత్రంలో నటించింది. ఇంత కాలానికి పావనికి ‘పుష్ప 2‘తో మంచి గుర్తింపు వచ్చింది.






