క్షణం కూడా ఆలోచించలే
‘కాంతార’ ప్రీక్వెల్‌తో పాటు ‘జై హనుమాన్’ వంటి ప్రతిష్టాత్మక చిత్రాలు చేస్తున్న రిషబ్ శెట్టికి ‘ది ప్రైడ్ ఆఫ్ భారత్: ఛత్రపతి శివాజీ మహారాజ్’ రూపంలో మంచి అవకాశం వచ్చింది. తను కూడా ఆనందంగా ఆ ప్రాజెక్టును ఓకే చేశానని రిషబ్ శెట్టి తెలిపారు. సినిమా ప్రకటనతో పాటే బోనస్‌గా ఫస్ట్‌లుక్‌ని సైతం చిత్ర యూనిట్ వదిలింది. ఇది కేవలం సినిమా మాత్రమే కాదని.. అసమానతలకు వ్యతిరేకంగా పోరాడటమే కాకుండా.. మొఘల్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన ఓ పోరాట యోధుని కథ అని ఇప్పటికే ఈ చిత్ర దర్శకుడు సందీప్ సింగ్ తెలిపారు. తాజాగా ఈ చిత్రం గురించి రిషబ్ శెట్టి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను తెలిపారు. “ఛత్రపతి శివాజీ మహారాజ్ పాత్రలో నటించే అవకాశం రావడం గౌరవంగా భావిస్తున్నా. ఇలాంటి బయోపిక్ అవకాశాలు చాలా అరుదుగా వస్తాయి. అలాంటిది అది నాకు రావడం చాలా ఆనందంగా వచ్చింది. అందుకే వచ్చిన వెంటనే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఓకే చెప్పాను. శివాజీ చరిత్రను నేటి తరానికి చెప్పడమే కాకుండా.. ఆ పాత్రకు ప్రాణం పోయడానికి సిద్ధంగా ఉన్నా. అద్భుతమైన సినిమాటిక్ అనుభవం కోసమే కాదు.. శివాజీ గురించి ఇప్పటి వరకూ తెలియని కథలను తెలుసుకోవడానికి కూడా సిద్ధంగా ఉండండి” అని రిషబ్ శెట్టి తెలిపారు. ఈ చిత్రం 2027 జనవరి 21న విడుదల కానుంది.






