రాయలసీమ ఏంటో రాచరికం చూపిస్తుంది
28-01-2025 12:00 AM
అప్సరా రాణి, విజయ్ శంకర్, వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘రాచరికం’. ఈశ్వర్ నిర్మాతగా చిల్ బ్రోస్ ఎంటర్టున్మైంట్స్ బ్యానర్ పై ఈ మూవీని నిర్మించారు. సురేశ్ లంకలపల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం జనవరి 31న విడుదల కానుంది. ఈక్రమంలో తాజాగా మూవీ ప్రి రిలీజ్‌ను నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో.. హీరో విజయ్ శంకర్, వరుణ్ సందేశ్ , దర్శకుడు సురేశ్ లంకలపల్లి, నిర్మాత ఈశ్వర్, నటి అప్సరా రాణి తదితరులు పాల్గొన్నారు. రాయలసీమ అంటే ఏంటనేది ఈ సినిమా చూపిస్తుందని చిత్ర యూనిట్ తెలిపింది.






