గడప గడపకు తెలంగాణ రక్షణసేన మేనిఫెస్టో
దమ్మపేటలో విస్తృత ప్రచారం
దమ్మపేట, ఆగష్టు (విజయ క్రాంతి): అశ్వారావుపేట నియోజకవర్గ ఇన్‌చార్జ్ సోడెం వెంకట్ ఆధ్వర్యంలో తెలంగాణ రక్షణసేన మేనిఫెస్టోను గడప గడపకు కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. ఇందులో భాగంగా దమ్మపేట మండలంలోని మల్లారం, వైబీఆర్ నగర్ ప్రాంతాల్లో పర్యటించిన సోడెం వెంకట్ ప్రజలను కలుసుకుని తెలంగాణ రక్షణసేన మేనిఫెస్టోలోని అంశాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, రాబోయే రోజుల్లో ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపై వివరించారు.
అలాగే టి ఆర్ ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్తగా ప్రవేశపెట్టిన “భూ లక్ష్మి” పథకం గురించి ప్రజలకు వివరించి, ఆ పథకం ద్వారా కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. ప్రజలకు ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలపై సరైన సమాచారం అందించడంతో పాటు, ప్రతి కుటుంబానికి మేనిఫెస్టోలోని అంశాలు చేరేలా గడప గడపకు ప్రచారం నిర్వహిస్తున్నామని సోడెం వెంకట్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.






