14 May, 2026 | 2:29 AM

విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం

14-05-2026 01:44 AM

ఖమ్మం, మే 13 (విజయక్రాంతి): నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక గత పది సంవత్సరాల్లో 89 రకాల పరీక్ష పేపర్లు లీక్ అవ్వడం ప్రపంచ చరిత్రలోనే ఆశ్చర్యకర విషయమని భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన నాటి నుండి ఇటువంటి చేతకాని ప్రధానమంత్రిని భారతదేశం ఎప్పుడు చూడలేదని యువజన కాంగ్రెస్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు వేజండ్ల సాయికుమార్ అన్నారు.

22 లక్షల మంది విద్యార్థులు తమ భవిష్యత్తు కోసం వ్రాసుకున్న నీట్ పరీక్ష పత్రం లీక్ అవ్వడాన్ని నిరసిస్తూ, కేంద్ర ప్రభుత్వ చేతకానితనం వల్లనే దేశంలో ఇటువంటి పరిణామాలు జరుగుతున్నాయని, తక్షణం ప్రధానమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం లోని స్థానిక జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయం కూడలి వద్ద ఖమ్మం జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు వేజండ్ల సాయికుమార్ ఆధ్వర్యంలో యువజన కాంగ్రెస్ కార్యకర్తలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు.

ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి, నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో స్టేట్ సెక్రటరీ అంజనీ, యాసిన్, బెజ్జం బాల గంగాధర్, నెల్లూరి ఉపేందర్, కొండూరి హృదయ్ కిరణ్, బెల్లం సాయి తేజ, అంబటి ఈశ్వర్, రాజేష్, సన్నీ, యడ్లపల్లి తరుణ్, యశ్వంత్, ఖాదర్ బాబా, చల్లగొండ్ల సాయి తేజ, మల్లెల గాంధీ, సంపత్ మరియు యువజన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.