14 May, 2026 | 3:15 AM

పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు తక్షణమే పంపిణీ చేయాలి

14-05-2026 01:45 AM

భద్రాద్రి కొత్తగూడెం, మే 13, (విజయక్రాంతి): కొత్తగూడెం పట్టణంలోని పాత కొత్తగూడెం వెన్నెల నగర్ కాలనీలో ఉన్న డబల్ బెడ్ రూమ్ ఇండ్లు 300 పై చినుకు పూర్తి అయి ఉన్నాయని, చిన్న చిన్న మైనర్ రిపేర్లతో పెండింగ్లో ఉన్నాయని వాటిని తక్షణమే లబ్ధిదారులకు అప్పగించాలని సేవ్ కొత్తగూడెం సేవ్ కార్పొరేషన్ కన్వీనర్, ఆవాజ్ పట్టణ కార్యదర్శి జలాల్ డిమాండ్ చేశారు.

బుధవారం  లబ్ధిదారులతో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 20 ఏళ్ల నుంచి పెండింగ్లో ఉన్నాయని, పూర్తికాని వాటికి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని, పూర్తి అయినది తక్షణమే పంపిణీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. స్థానిక ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యే, మంత్రులు, ఎంపీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం పై సమీక్ష సమావేశం నిర్వహించాలని ఆయన కోరారు.

20 ఏళ్ల నుంచి పెండింగ్లో ఉన్న గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని ప్రస్తుత ప్రభుత్వం సైతం అసంపూర్తిగా ఉన్న డబల్ బెడ్ రూమ్ ఇండ్లు పూర్తి చేయాలని ప్రకటనలు చేస్తున్నప్పటికీ అవి ఆచరణలో కార్యరూపం దాల్చట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. డబల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం కొనసాగుతుందా లేదా అనేది ప్రజా ప్రతినిధులు ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని. పూర్తి అయిన వాటినే తక్షణమే లబ్ధిదారులకు ఇవ్వాలని లేకపోతే దశల వారి ఆందోళన కార్యక్రమం అవసరమైతే లబ్ధిదారులతో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ఆక్రమణ కార్యక్రమం చేపడతామని ఆయన హెచ్చరించారు.