13 July, 2026 | 2:48 PM

సందడి షురూ

11-12-2024 12:00 AM

రామ్ చరణ్, శంకర్ కాంబోలో వస్తున్న చిత్రం ‘గేమ్ చేంజర్’. కియారా అద్వాని హీరోయిన్‌గా నటిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో అంజలి, ఎస్జే సూర్య తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ ఇప్పటికే చిత్ర యూనిట్ పరోక్షంగా ప్రారంభించింది. పూర్తి స్థాయిలో ప్రమోషన్స్ మొదలు పెడితే కానీ అసలైన బజ్ క్రియేట్ కాదు. ఇక ఈ సినిమా ప్రిరిలీజ్ ఈవెంట్‌ను మేకర్స్ ఈ నెల 21న అమెరికాలోని టెక్సాస్‌లో ప్లాన్ చేస్తున్నారు. అమెరికాలో ప్రిరిలీజ్ ఈవెంట్ జరగడం అనేది తొలిసారి కావడంతో ఈ సినిమా హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ ప్రి రిలీజ్ ఈవెంట్‌కు దర్శకుడు సుకుమార్ హాజరుకానున్నారని సమాచారం. సుకుమార్, రామ్ చరణ్ కాంబోలో ‘ఆర్‌సీ 17’ రూపొందనుందని తెలుస్తోంది. ఇక ‘గేమ్ చేంజర్ ’ చిత్రంలోని ‘నానా హైరానా’ పాట విడుదలైన 6 రోజుల్లోనే 47 మిలియన్ల వ్యూస్‌తో దూసు కెళుతోంది. ఈ పాట దేశంలోనే తొలిసారిగా ఐఆర్ కెమెరాతో రూపొందింది. అంతేకాకుండా హెలికాఫ్టర్ ద్వారా ఈ పాటను షూట్ చేయడం జరిగింది. ఈ సినిమాను డిసెంబర్ 10న విడుదల చేస్తున్నట్టు ప్రకటిస్తూ చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. మొత్తానికి ‘గేమ్ చేంజర్’ సందడి అయితే షురూ అయిపోయింది.