calender_icon.png 20 December, 2025 | 7:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వెన్నుపోటు రాజకీయాల వల్లే పార్టీకి నష్టం

20-12-2025 12:55:04 AM

  1. ఏఐసీసీ, పీసీసీ, క్రమశిక్షణ సంఘం ఫిర్యాదు చేస్తా 

ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

వనపర్తి, డిసెంబర్ 19 (విజయక్రాంతి) : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల వెన్నుపోటు రాజకీయాల కాంగ్రెస్ జండా మోసిన కార్యకర్తలకు నష్టం వాటిళ్ళిందని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి మండిపడ్డారు. శుక్రవారం వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి నంది హిల్స్ లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. వనపర్తి నియోజక వర్గం పరిధిలోని 140 గ్రామపంచాయతీ స్థానాలకు ఇటీవల జరిగిన గ్రామ సర్పంచ్ , వార్డు సభ్యుల ఎన్నికలలో రెండేళ్ల కాంగ్రెస్ పాలన పై ప్రజలు తమ సంతృప్తిని ఓటురూపకంగా తెలిపారన్నారు.

కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను తమ మద్దతు తెలిపిన ఓటర్లకు, ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. వనపర్తి నియోజకవర్గంలో  51 శాతం బీసీలను బరిలో దించామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే స్థానిక గ్రామ పంచాయతీ ఎన్నికలలో గ్రామీణ ప్రాంతాలలో 35.09 శాతం పెరిగిందన్నారు. బీ.ఆర్.ఎస్ పార్టీకి వచ్చిన 51 గ్రామపంచాయతీ స్థానాలలో 15-20 స్థానాలు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందే అవకాశం ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల వెన్నుపోటు రాజకీయాల కారణం గా కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన కార్యకర్తలకు నష్టం జరిగిందని ఆరోపించారు.

ఈ విషయమై ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ హైకామాండ్ కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. ఎమ్మెల్యే గా నాపై, నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి జారిప కోపం ఉంటే ప్రత్యేక్షంగా చూసుకోవాలని కాంగ్రెస్ పార్టీకి విధేయులుగా ,జండా మోసిన కార్యకర్తలను టార్గెట్ చేయడం ఏంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులమని చెప్పుకుంటూ పార్టీకి ద్రోహం చేసేవాళ్ళతీరును కాంగ్రెస్ పార్టీ మేధావులు,ప్రజలుగమనిస్తున్నారని,సీనియర్ నాయకులు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందని డిమాండ్ చేశారు.

ఈ సమావేశంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, పెబ్బేరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ అధ్యక్షురాలు ప్రమోదిని రెడ్డి, పీసీసీ సభ్యులు శంకర్ ప్రసాద్, మున్సిపల్ మాజీ చైర్మన్, వైస్ చైర్మన్, పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ కౌన్సిలర్లు, వివిధ మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.