20-12-2025 12:54:50 AM
హైదరాబాద్, డిసెంబర్ 19 (విజయక్రాం తి): తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం(పీఏసీఎస్) చైర్మన్లు, డైరెక్టర్ల పాలకవర్గాలను రద్దు చేసింది. వీరితో పాటు తొమ్మిది జిల్లాల డీసీసీజీలను కూడా తొలగి స్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆగస్టు 14వ తేదీ వరకే పొడిగింపు పదవీ కాలం ముగిసింది.
అయినప్పటికీ వ్యవసాయాభివృద్ధి, రైతు సంక్షేమం దృష్ట్యా గడు వును పెంచింది. ఈ సోసైటీలకు గత ప్రభుత్వ హయాంలో 2020 ఫిబ్రవరి 13న ఎన్నికలు జరిగాయి. వీటి పదవీ కాలం ఈ ఏడాది ఫిబ్రవరితో ముగిసింది. ఫిబ్రవరితో ముగిసిన పదవీకాలని 6 నెలల పాటు పొడిగించింది. పొడిగించిన పదవీ కాలం కూడా ముగియడం తో తాజాగా పాలకవర్గాలను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది.