20-12-2025 12:55:07 AM
కరింనగర్, డిసెంబర్19(విజయక్రాంతి): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సమ్మక్క సారలమ్మ వనదేవతల మహా జాతర జనవరి 28 నుంచి 31 వరకు జాతర జరుగనుంది. నాలుగు రోజుల పాటు ఈ జాతర జరుగుతుంది. తొలిరోజు జనవరి 28న సాయంత్రం 6 గంటలకు సా రలమ్మను, గోవింద రాజు, పగిడిద్ద రాజులను గద్దెపైకి తీసుకురావడంతో జాతర మొదలవుతుంది. రెండో రోజు 29న సా యంత్రం 6 గంటలకు సమ్మక్క దేవతను గద్దె మీదకు తీసుకొస్తారు.
కరింనగర్ జిల్లా లో 16 చోట్ల సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహించనున్నారు. రేకుర్తి, కేశవపట్నం, హుజూరాబాద్లో పెద్ద ఎత్తున జాతర జరుగుతుంది. అయితే ఇప్పటివరకు ఏర్పాట్ల పై ప్రభుత్వం, జాతర నిర్వాహకులు దృష్టి సా రించలేదు. 2022 లో అప్పటి బి ఆర్ ఎస్ ప్రభుత్వం రేకుర్తిలో కోటి రూపాయలకు పైన వెచ్చించి ఏర్పాట్లు చేసింది. గద్దె ను తీర్చిదిద్దడంతో పాటు చుట్టూ సి సి రొద్దులను నిర్మించారు. శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేసిన రేలింగ్ శిథిలమైయింది.
బారికేడింగ్ ఏర్పాటు చేయాలి - సూదగోని మాధవి కృష్ణ గౌడ్ మాజీ కార్పొరేటర్
క్యూలైన్కు బారికేడింగ్ ఏర్పాటు చేయా లి. జాతర సమయంలో కెనాల్లో స్నానాలకు నీటిని విడుదల చేయాలి. గజ ఈతగాళ్లను నియమించాలి, జాతర ముగిసే వరకు అంతరాయం లేకుండా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలి. 108 వాహనాలు, మందులు, డాక్టర్లతో వైద్య శిబిరాల ను ఏర్పాటు చేయాలి. 2022 లో మాజీ మంత్రి గంగుల కమలాకర్, మాజీ మేయర్ సునీల్ రావు లు ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి చేశారు. ప్రస్తుతం భక్తుల తాకిడి మొదలున కనీసం గద్దెకు రంగులువేయలేదు. భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలి.
ఏర్పాట్లు చేస్తాం:- ప్రపూల్ దేశాయి, కమిషనర్, కరింనగర్ నగరపాలక సంస్థ
నగరపాలక సంస్థ పరిదిలోని సమ్మక్క సారలమ్మ జాతరకు ఘనంగా ఏర్పాట్లు చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. 2026 జనవరి చివరి వారంలో జరగబోయే వనదేవతల జాతర మహోత్సవ ఏర్పాట్లను పురస్కరించుకుని రేకుర్తి, హౌజింగ్ బోర్డ్ ( బొమ్మకల్ శివారు) సమ్మక్క సారలమ్మ గద్దెలను సందర్శించాం. గతంలో నగరపాలక సంస్థ ద్వారా రేకుర్తి ప్రాంతంలో చేసిన అభివృద్ధి ఏర్పాట్లను పరిశీలించాము. టాం. జిల్లా కలెక్టర్ స్పెషల్ ఆఫీసర్ సూచనల మేరకుజాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసేందుకు చర్యలు తీసుకుంటాం.